Prabhas: డార్లింగ్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Prabhas: డార్లింగ్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

Interesting Buzz On Prabhas Maruthi Movie

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, సినిమా స్లోగా ఉందనే కారణంగా సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే వసూళ్ల పరంగా మాత్రం రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇక ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన ప్రభాస్, తన నెక్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

Prabhas: ట్రెండ్ సెట్టర్ ప్రభాస్.. జీ హుజూర్ అంటున్న రికార్డులు!

ఇప్పటికే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్, ఆ తరవాత ‘మహానటి’ ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా ప్రభాస్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుందని భావించిన డార్లింగ్, ఈ గ్యాప్‌లో ఓ చిన్న సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.

చిన్న సినిమాలను భారీ బ్లాక్‌బస్టర్స్‌గా మార్చే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు సిద్దమవుతోంది. కాగా ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Prabhas: రెబల్ స్టార్ ఇక్కడ.. హిట్టు-ఫట్టు లెక్కేలేదు!

ప్రభాస్ నటించబోయే ఈ సినిమాలో మారుతి ఏకంగా ముగ్గురు హీరోయిన్లను దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కథలో భాగంగా ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారట. అయితే ఇప్పటికే హీరోయిన్లుగా శ్రీలీలా, మాళవికా మోహనన్‌లను ఫిక్స్ చేశాడట మారుతి. మరో హీరోయిన్ కోసం ఈ డైరెక్టర్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ పక్కన ఒకేసారి ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.