Prabhas: రాధేశ్యామ్ టు రాజా డీలక్స్.. తూచ్.. అంటోన్న ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్.....

Prabhas: రాధేశ్యామ్ టు రాజా డీలక్స్.. తూచ్.. అంటోన్న ప్రభాస్!

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కంటెంట్‌లో దమ్ములేకపోవడంతో ఈ సినిమాను తిరస్కరించారు ఆడియెన్స్. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపకపోడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా మిగలనుంది. ఇక రాధేశ్యామ్ ఎఫెక్ట్ నుండి బయటపడేందుకు ప్రభాస్ తెగ ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఓ మీడియం రేంజ్ సినిమాను తీసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

Prabhas: రాధేశ్యామ్‌కు భారీ కలెక్షన్లు.. బాహుబలి క్రేజే కారణమా?

ఈ క్రమంలోనే చిన్న చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమాను వెంటనే చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు ముగిశాయని, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా పట్టాలెక్కించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాను హార్రర్ కామెడీగా తెరకెక్కించేందుకు దర్శకుడు మారుతి సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఇటీవల ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

కానీ ఈ టైటిల్ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు చిత్ర యూనిట్. దర్శకుడు మారుతి గతంలో మాస్ రాజా రవితేజ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేయగా, ఆ కథకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభాస్ కోసం రాసుకున్న కథ వేరొకటని, దీనికి రాజా డీలక్స్ టైటిల్‌తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ హార్రర్ కామెడీ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. వారిలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీలా హీరోయిన్లుగా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి.దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.