Prabhas: సలార్.. ఈ ఏడాది లేనట్టే!

యంగ్ రబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో తన నెక్ట్స్ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు.......

Prabhas: సలార్.. ఈ ఏడాది లేనట్టే!

Prabhas Salaar Movie To Get Release Next Year

Prabhas: యంగ్ రబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో తన నెక్ట్స్ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన నెక్ట్స్ చిత్రంగా ఏ సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘ఆదిపురుష్’ చిత్రం ముందుగా రిలీజ్ అవుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ‘సలార్’ కూడా రిలీజ్‌ను చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Salaar: బాప్ రే.. సలార్ ఓటీటీ రైట్స్ కోసం రూ.200 కోట్ల ఆఫర్?

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సలార్ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదని చిత్ర యూనిట్ అంటోంది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకోవడంతో ఈ సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ ఏడాది సలార్ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రం కోసం ప్రభాస్ చాలా సమయాన్ని కేటాయించడం, ఆ సినిమా ఫెయిల్యూర్‌గా మిగలడంతో, తన నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ప్రభాస్ పక్కా ప్లానింగ్‌తో రావాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఆదిపురుష్ 3D చిత్రం కావడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి, సలార్ చిత్రంపై ఫోకస్ పెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ఏప్రిల్ నెలలో జరుపుకోవాలని.. ఈ సినిమాను ఈ యేడాది చివరినాటికి పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నిర్ణయంతో సలార్ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడట.

Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న సలార్ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని హొంబాలే ఫిలింస్ భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. మరి సలార్ చిత్రం నిజంగానే ఈ యేడాదిలో రిలీజ్ కాదా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.