The Rajasaab: అది ప్రభాస్ కాదు.. డూప్ తో సినిమా చేస్తావా.. మారుతీపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్?
ది రాజాసాబ్(The Rajasaab) ఓటీటీ విడుదల తరువాత మరోసారి మారుతిపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.
Prabhas fans targeting director maruthi After the OTT release of 'The Raja Saab movie.
- మారుతీపై మళ్ళీ మొదలైన ట్రోలింగ్
- ది రాజాసాబ్ లో చేసింది ప్రభాస్ కాదంటూ కామెంట్స్
- స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ మండిపాటు
The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్(The Rajasaab), సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ ఛాన్స్ ఇస్తే ఇలాంటి సినిమా చేస్తావా అంటూ మండిపడ్డారు. కథ, కథనం, డైరెక్షన్ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటూ, అసలు ఆ కథ ప్రభాస్ చేయాల్సింది కానే కాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
అంతటితో ఆగకుండా, మారుతీ ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లో పార్సిల్స్ కూడా పంపారు. కొంతంది ఫుడ్ పార్సిల్స్, కొంతమంది మెడికల్ పార్సిల్స్ పంపించారట. ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ స్వయంగా సోషల్ మీడియాలో చెప్పాడు. రాను రాను ఆ మ్యాటర్ డైల్యూట్ అయ్యింది అనుకునే సమయంలో మరోసారి ఇప్పుడు మారుతీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. ఎందుకంటే, ది రాజాసాబ్ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.
Balakrishna: బాలయ్య మంచి మనసు.. మెగా ట్విన్స్ కి కానుకలు పంపిన బాలకృష్ణ
ఇప్పుడు, ఆ సినిమాను ఓటీటీ చూస్తూ ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయి అంటూ స్క్రీన్ షాట్స్ తీసి మరి మారుతీని ట్యాగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక చాలా చోట్ల ప్రభాస్ ని కాకుండా అతని డూప్ తో సినిమా చేసినట్టుగా కనిపించింది అంటూ ఆ ఫేమ్ అటాచ్ చేసిన వీడియోలను, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ప్రభాస్ తో కాకుండా ఎవరితోనో సినిమా చేసి జనాల మీదకి వదులుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. మరోపక్క కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్.
