Prabhas : ప్రభాస్ ఆ డైరెక్టర్స్ వద్దే కంఫర్టబుల్‌గా ఉంటాడట.. పాపం రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..
ఇప్పుడు ఇచ్చిన సలార్ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజమౌళి పేరు చెప్పకుండా, తాను బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది వేరే ఇద్దరి డైరెక్టర్స్ పేరు చెప్పాడు.

Prabhas Interesting Comments on Prashanth Neel and VV Vinayak and Forget about Rajamouli Video goes Viral
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇటీవలే సలార్(Salaar) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. సలార్ సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా గ్రాండ్ గా చేసుకుంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేశారు.
ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఆ ఇంటర్వ్యూ నుంచి కొన్ని పార్టులు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. వీటిల్లో సినిమా గురించే కాక పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు ఈ ముగ్గురు. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ప్రభాస్ ని రాజమౌళి(Rajamouli) ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో చేసాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ చేసాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. బాహుబలి ప్రమోషన్స్ లో రాజమౌళి – ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.
Also Read : Eagle : రవితేజ ‘ఈగల్’ సినిమాకి మళ్ళీ కష్టాలు.. సోలో డేట్ కోసం ఫిలిం ఛాంబర్‌కి నిర్మాతల లేఖ..
అయితే ఇప్పుడు ఇచ్చిన సలార్ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజమౌళి పేరు చెప్పకుండా, తాను బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది వేరే ఇద్దరి డైరెక్టర్స్ పేరు చెప్పాడు. ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ గురించి ప్రస్తావన రాగా ప్రభాస్ మాట్లాడుతూ.. నా 21 ఏళ్ళ కెరీర్ లో మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అతన్ని షూట్ అయ్యాక కూడా కలుస్తాను. బాగా మాట్లాడతాడు. ఎంటర్టైన్ చేస్తాడు. గతంలో వివి వినాయక్ గారి దగ్గర అంతా కంఫర్ట్ గా ఉన్నాను. కానీ ఆయనతో ఆరు నెలలే ట్రావెలింగ్. నీల్ తో రెండేళ్లకు పైగా. మళ్ళీ సలార్ 2కి కూడా ట్రావెల్ చేస్తాను. నీల్ యాక్టర్స్ ని దేవుళ్ళలాగ చూస్తాడు అని పొగిడాడు.
దీంతో ప్రభాస్ అన్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. నీల్, వివి వినాయక్ పేర్లు చెప్పి అతనికి లైఫ్ ఇచ్చిన రాజమౌళి పేరు చెప్పలేదని కొందరు, కొంతమందేమో ఇప్పుడు ప్రశాంత్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అతన్ని పొగడాలని పొగిడాడు అని, ఇంకొందరేమో రాజమౌళి బయట ఎలా ఉన్నా వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు కాబట్టి కంఫర్ట్ అని చెప్పలేదేమో, కానీ వాళ్లిద్దరూ బాగానే ఉంటారు అని రాజమౌళి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి పేరు చెప్పకుండా ప్రభాస్ ప్రశాంత్ నీల్, వివి వినాయక్ ల వద్దే కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను అని చెప్పడం వైరల్ గా మారింది.