Eagle : రవితేజ ‘ఈగల్’ సినిమాకి మళ్ళీ కష్టాలు.. సోలో డేట్ కోసం ఫిలిం ఛాంబర్‌కి నిర్మాతల లేఖ..

సంక్రాంతి నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

Eagle : రవితేజ ‘ఈగల్’ సినిమాకి మళ్ళీ కష్టాలు.. సోలో డేట్ కోసం ఫిలిం ఛాంబర్‌కి నిర్మాతల లేఖ..

Raviteaj Eagle Movie Producers People Media Factory Letter to Telugu Film Chamber

Updated On : January 19, 2024 / 12:03 PM IST

Raviteja Eagle : రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా ఈ సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ ఎక్కువ సినిమాలు ఉండటం, థియేటర్స్ ఇబ్బందులు రావడంతో నిర్మాతల మండలి తప్పుకొమ్మని రిక్వెస్ట్ చేయగా ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ ఇందుకు ఒప్పుకున్నారు. సంక్రాంతి నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

కానీ ఇప్పుడు అదే డేట్ కి మళ్ళీ పలు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఫిబ్రవరి 8 యాత్ర 2, ఫిబ్రవరి 9 ఊరుపేరు భైరవకోన, లాల్ సలామ్ డబ్బింగ్ రిలీజ్.. లు వచ్చాయి. ఇంకా చిన్న చితకా సినిమాలు కూడా అదే డేట్ కి వచ్చేలా ఉన్నాయి. దీంతో రవితేజ ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విషయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కి లేఖ రాశారు.

Also Raed : Matka Opening Bracket : వరుణ్ తేజ్ ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్.. ఈ సారి పాన్ ఇండియా ప్రామిస్..

ఈగల్ నిర్మాణ సంస్థ ఈ లేఖలో.. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం మేము వాయిదా వేసుకున్నాం. అందుకు మా సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామన్నారు. కానీ మా సినిమా రిలీజ్ రోజే మరిన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని ఛాంబర్ ను కోరుతున్నాం అని రాశారు.

Raviteaj Eagle Movie Producers People Media Factory Letter to Telugu Film Chamber

ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని ఈగల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల సందీప్ కిషన్ ఊరుపేరు భైరవ కోన సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9న రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్లో ఇదే ఇష్యూ గురించి పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సందీప్ కిషన్ సమాధానిస్తూ.. మాకు రవితేజ గారంటే అభిమానం ఉంది. కానీ తప్పట్లేదు అని అన్నారు.