Kalki 2898 AD : ‘కల్కి 2898AD’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’.

Prabhas Kalki 2898 ad
Prabhas Kalki 2898 ad pre release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతున్నఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూరైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.
ఈ మూవీ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడిపిస్తూనే ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.
కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్సైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. మే 22న ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారట. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.