Prabhas : రాజా డీలక్స్.. సైలెంట్‌గా కానిచేస్తున్న ప్రభాస్.. లీక్ అయిన షూటింగ్ పిక్స్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని, షూటింగ్ కూడా మొదలైందని, రాజా డీలక్స్ ఆ సినిమా పేరని, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం.............

Prabhas : రాజా డీలక్స్.. సైలెంట్‌గా కానిచేస్తున్న ప్రభాస్.. లీక్ అయిన షూటింగ్ పిక్స్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Prabhas maruthi movie shooting pics leak

Updated On : December 25, 2022 / 9:38 PM IST

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత సినిమా రాధేశ్యామ్ నిరాశ పరచడంతో ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ప్రాజెక్ట్ K సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇన్ని భారీ సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాని ఒప్పుకున్నాడు ప్రభాస్.

రొమాంటికి కామెడీ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని, షూటింగ్ కూడా మొదలైందని, రాజా డీలక్స్ ఆ సినిమా పేరని, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. దీంతో కొంతమంది ఈ వార్తలని లైట్ తీసుకున్నా కొంతమంది మాత్రం మారుతితో సినిమా వద్దని ట్రోల్ చేశారు.

Anupama Parameswaran : హీరోయిన్ తో కలిసి స్టెప్పులేసిన అల్లు అరవింద్, సుకుమార్.. వీడియో వైరల్..

తాజాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సెట్ నుంచి రెండు ఫోటోలు లీక్ అవ్వడంతో ఇవి వైరల్ గా మారాయి. ఒక ఫొటోలో ప్రభాస్ కూర్చొని ఉండగా పక్కనే మారుతి కూడా కూర్చొని సీన్ వివరిస్తున్నట్టు ఉంది. మరో ఫొటోలో ప్రభాస్ ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈ పిక్స్ లీక్ అవడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే సినిమా మొదలుపెట్టి షూటింగ్ చేసేస్తున్నారా అంటూ షాక్ అయ్యారు. అయితే ఫొటోలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.