RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్ అలర్ట్.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ బిగ్ అప్డేట్.. స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్(RajaSaab). కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్ అలర్ట్.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ బిగ్ అప్డేట్.. స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్

Prabhas Raja Saab movie movie first song update coming on november 21

Updated On : November 20, 2025 / 7:19 PM IST

RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్(RajaSaab). కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రాజాసాబ్ నుంచి మొదటి సాంగ్ విడుదల అవుతుంది అంటూ చాలా కాలంగా మేకర్స్ చెప్తూ వస్తున్నారు. కానీ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు.

Ravi Babu: అవును సినిమాకి ఏనుగు పోస్టర్.. ఫోన్ చేసి మరీ తిట్టారు.. వాళ్లకు అలా అర్థమయ్యింది..

అయితే, తాజాగా రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కి సంబందించిన అప్డేట్ నవంబర్ 21న విడుదల చేస్తారు అంటూ పోస్టర్ విడుదల చేశారు. స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్.. అంటూ వచ్చిన ఈ పోస్టర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో సాంగ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటున్నారు. అలాగే తమన్ కూడా మొదటిసారి ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి, నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ అందించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్ అంటూ సాగే ఆ పాట సినిమాలో ప్రభాస్ పరిచయ గీతం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి భారీ అంచనాలు నెలకొన్న రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ రేపు(నవంబర్ 21) రానుంది. మరి ఆ అప్డేట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే రేపటివరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.