Rajasaab : ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు.. వామ్మో ప్రీమియర్ కి ఏకంగా..
సంక్రాంతికి కూడా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు నిర్మాతలు. (Rajasaab)
Rajasaab
- రాజాసాబ్ టికెట్ రేట్లు
- ఏపీలో భారీగా పెంపు
- ప్రీమియర్ కి షాకింగ్ ప్రైజ్
Rajasaab : సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారు అని విమర్శలు వస్తున్నా, టికెట్ రేట్లు పెరగడం వల్ల సినిమాలకు జనాలు రావట్లేదని జనాలు, సినిమా వాళ్లే చెప్తున్నా మళ్ళీ పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకు భారీగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సంక్రాంతికి ఏకంగా 7 సినిమాలు బరిలో ఉన్నాయి. 5 తెలుగు సినిమాలు ఉండగా రాజాసాబ్ తప్ప అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే.(Rajasaab)
ఇప్పుడు సంక్రాంతికి కూడా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఏపీ ప్రభుత్వం రాజాసాబ్ సినిమాకు భారీగా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. రాజాసాబ్ సినిమా జనవరి 9 న రిలీజ్ అవుతుంది. ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు.
ఏపీ జీవో ప్రకారం 8వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్ కి అనుమతులు ఇచ్చారు. ప్రీమియర్ కి ఏకంగా 1000 రూపాయలు టికెట్ ధర పెట్టుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. అలాగే 9వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. మొదటి పది రోజులు రోజుకు 5 షోలు అనుమతి ఇచ్చారు.
ఈ లెక్కన రాజాసాబ్ సినిమాకు ఏపీ లో సింగిల్ స్క్రీన్స్ లో 297 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 377 రూపాయలు టికెట్ ధర ఉండనుంది. పండక్కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్దాం అనుకుంటే ఇలా భారీగా టికెట్ ధరలు పెంచేస్తున్నారు అని నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని హైకోర్టు తాజాగా పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణ రేట్లు కూడా నేడు లేదా రేపు రానున్నాయి. ఈ సంక్రాంతికి టికెట్ రేట్లు పెంచకుండా ఏదైనా సినిమాలు వస్తే అవే భారీ సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Also Read : Seetha Payanam : కూతురు హీరోయిన్ గా.. తండ్రి దర్శకుడిగా.. సీతా పయనం నుంచి పెళ్లి సాంగ్ చూశారా..?
