Prabhas Marriage : అందుకే నాకింకా పెళ్ళికాలేదు.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఫస్ట్ వినిపించే పేరు ప్రభాస్ దే. ఒకదానివెంట ఒకటి వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాల మధ్యలో పడి......
Prabhas : టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఫస్ట్ వినిపించే పేరు ప్రభాస్ దే. ఒకదానివెంట ఒకటి వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాల మధ్యలో పడి ప్రభాస్ పెళ్లి కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు. చాలా మంది ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరూ ప్రభాస్ పెళ్లిని చూడాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. దీంతో మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా బుధవారం నాడు ఈ సినిమా నుంచి మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాడు ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ పెళ్లిపై ప్రశ్న ఎదురైంది.
Mani Ratnam’s PS1: డ్రీమ్ ప్రాజెక్ట్ పీఎస్-1 రిలీజ్ డేట్ ప్రకటించిన మణిరత్నం
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు’ అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ని గుర్తు చేస్తూ ఓ విలేఖరి ‘రియల్ లైఫ్‌లో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా?’ అని ప్రభాస్‌ను ప్రశ్నించారు. దీనికి ప్రభాస్.. ”ప్రేమ విషయంలో చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నాకింకా పెళ్లి కాలేదు” అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ప్రభాస్ గతంలో ప్రేమలో మునిగే ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు.