Salaar Trailer : సలార్ ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ఆఫర్..

సలార్ ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేస్తూ నిర్మాతలు.. ఫ్యాన్స్‌కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటంటే..

Salaar Trailer : సలార్ ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ఆఫర్..

Prabhas Salaar movie makers announce exact Trailer release time and offer

Updated On : November 30, 2023 / 1:43 PM IST

Salaar Trailer : రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ హైపెడ్ మూవీ ‘సలార్’. ఇక రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. ట్రైలర్‌ రిలీజ్ తో ఈ మూవీ ప్రమోషన్స్ కి తెరలేపుతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇప్పుడు కరెక్ట్ టైంని తెలియజేస్తూ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ఆఫర్ ని కూడా ప్రకటించారు. ఇంతకీ ఆ టైం అండ్ ఆఫర్ ఏంటి..?

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని రేపు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇక సలార్ టీం ఇచ్చిన ఆఫర్ ఏంటంటే.. ఐదు బెస్ట్ క్యాప్షన్స్ చెప్పిన వారికీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇస్తామంటూ ప్రకటించారు. ఫ్యాన్స్.. మరి ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకోండి. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. సలార్ కథ ఏంటి..? ‘కేజీఎఫ్’తో సలార్ కి కనెక్షన్ ఉందా..? అనే విషయాలను తెలియజేశారు. సలార్ కథ అంతా ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుందట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సినిమా కథ అని తెలియజేశారు.

Also read : Chiranjeevi : పోలింగ్ బూత్ వద్ద కూడా చిరంజీవి.. కామెడీ టైమింగ్ మామూలుగా లేదుగా..

కాగా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ‘ఉగ్రం’ స్టోరీ కూడా ఇదే కథ. అయితే ఆ కథలో ఫ్రెండ్స్ మధ్య పూర్తి స్థాయి శత్రుత్వం చూపించారు. సలార్ సినిమాలో ఫ్రెండ్స్ మధ్య గొడవనే మెయిన్ పాయింట్ గా తీసుకోని తెరకెక్కిస్తున్నారు. ఇక సలార్, కేజీఎఫ్ కనెక్షన్ విషయానికి వస్తే.. సలార్ స్టాండ్ ఎలోన్ చిత్రం అని, కేజీఎఫ్ తో కనెక్షన్ ఉంటుందని ఆశించకండి అంటూ ఆడియన్స్ కి తెలియజేశారు. దీంతో ఈ రెండు విషయాలు అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తుంది. కాగా ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.