Chiranjeevi : పోలింగ్ బూత్ వద్ద కూడా చిరంజీవి.. కామెడీ టైమింగ్ మామూలుగా లేదుగా..
మెగాస్టార్ ఎక్కడ ఉన్నా కామెడీ టైమింగ్ మాత్రం అసలు మారదు. తాజాగా తెలంగాణ ఎన్నికల పోలింగ్ వద్ద..

Chiranjeevi comedy timing at 2023 Assembly Elections polling center
Chiranjeevi : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమ ఓటుని వేయడానికి సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటుని వేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారని తెలుస్తుంది. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ కొణిదెల కూడా ఓటు వేయడానికి వచ్చారు.
సాధారణ ప్రజలతో పాటు ఈ మెగా కుటుంబం కూడా లైన్ లో నిలబడి ఓటుని వేసి వచ్చారు. కాగా ఓటు వేసేందుకు లైన్ లో ఉన్న నిలబడి ఉన్న చిరంజీవిని ప్రశ్నించేందుకు ఒక మీడియా ప్రతినిధి వెళ్లారు. ఆ రిపోర్టర్ ఎన్నికలు గురించి చిరంజీవి ప్రశ్నించగా, మెగాస్టార్ బదులిస్తూ.. “మౌనవ్రతంలో ఉన్నాను” అంటూ తానే మాట్లాడి చెప్పి పోలింగ్ బూత్ వద్ద కూడా తన కామెడీ టైమింగ్ ని చూపించారు. రిపోర్టర్ మరోసారి చిరంజీవిని మాట్లాడించే ప్రయత్నం చేయించినా.. ఆయన మాత్రం మాట్లాడకుండా గొంతు బాగోలేదని చెప్పి మౌనం పాటించారు.
Also read: Mokshagna : ఓటేయడానికి వచ్చిన మోక్షజ్ఞ.. ఇంత సన్నబడ్డాడేంటి? సినిమా కోసమేనా?
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజెన్స్.. ఎక్కడ ఉన్న బాస్ కామెడీ టైమింగ్ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెడీ టైమింగ్ ని మీరుకూడా చూసి ఎంజాయ్ చేయండి. కాగా మెగాహీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రామ్ చరణ్ తో పాటు మిగిలిన మెగా హీరోలు కూడా మరికొంతసేపటిలో పోలింగ్ బూత్ కి చేరుకున్నారు.
Boss timing ???? pic.twitter.com/sFcrGqnwCv
— Chirag Arora (@Chiru2020_) November 30, 2023