Salaar : ఆగష్టులో సలార్ ట్రైలర్.. రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

సలార్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ కి టైం అయ్యింది. ఆగష్టులో ట్రైలర్ కి రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం.

Salaar : ఆగష్టులో సలార్ ట్రైలర్.. రెడీగా ఉండండి అంటూ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..

Prabhas Salaar part 1 Ceasefire trailer released on august

Updated On : July 8, 2023 / 2:41 PM IST

Salaar : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. రిలీజ్ అయిన 24 గంటలోనే అత్యధిక వ్యూస్ రికార్డు క్రియేట్ చేసిన ఈ టీజర్.. తాజాగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా క్రాస్ చేసేసింది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేయడంతో మూవీ టీం అభిమానులకు థాంక్యూ చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఆ నోట్ లో ట్రైలర్ రిలీజ్ గురించి కూడా చెప్పుకొచ్చారు.

Mega Heroes : ఆగష్టులో మెగా హీరోల సినిమా కార్నివాల్.. పవన్ అండ్ సాయి ధరమ్..

“మీ క్యాలెండర్ లో ఆగస్ట్ నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ మీ కోసం వస్తోంది. మీకు మరపురాని అనుభవాన్ని కలిగించే మరిన్ని అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి. మన ఇండియన్ సినిమా శక్తిని చాటి చెప్పే ఈ ఆనందకరమైన ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దాం” అంటూ పేర్కొన్నారు. మొన్న రిలీజ్ అయిన టీజర్ లో ప్రభాస్.. సరిగా కనిపించకపోవడం, డైలాగ్స్ కూడా చెప్పకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ వార్త చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Yatra 2 : యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్.. రిలీజ్ డేట్ కూడా ఖరారు..


కాగా ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి పార్ట్ ని ‘Ceasefire’ అనే పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.