Salaar – Dunki : అమెరికాలో కూడా షారుఖ్‌పై ప్రభాస్ పైచేయి.. సలార్ వసూళ్ల ముందు వెలవెలబోయిన డంకీ..

సలార్, డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల్లో..

Salaar – Dunki : అమెరికాలో కూడా షారుఖ్‌పై ప్రభాస్ పైచేయి.. సలార్ వసూళ్ల ముందు వెలవెలబోయిన డంకీ..

Prabhas Salaar Shah Rukh Khan Dunki movie collections war

Updated On : December 27, 2023 / 6:54 PM IST

Salaar – Dunki : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ గత వారం థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ డైనోసార్స్. అలాంటిది ఇద్దరు ఒకేసారి థియేటర్స్ కి వస్తున్నారంటే.. ఆడియన్స్ లో ఆ సినిమాల కలెక్షన్స్ పై ఆసక్తి నెలకుంటుంది. ఈక్రమంలోనే సలార్, డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయని అభిమానులు గమనిస్తూ ఉన్నారు.

ఇండియాలో సలార్ సినిమా డంకీ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడతూ తనదే పైచేయి అని నిరూపిస్తుంది. ఇక ఓవర్ సీస్ లో కూడా షారుఖ్‌పై ప్రభాస్ పైచేయి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. డంకీ మూవీ అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద 4.8M డాలర్ కలెక్షన్స్ రాబడితే, సలార్ మూవీ 7M డాలర్ల కలెక్షన్స్ రాబట్టి అదరహో అనిపిస్తుంది. అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 2 ప్లేస్‌ల్లో బాహుబలి 2, RRR ఉంటే.. మూడో స్థానాన్ని ఇప్పుడు సలార్ కైవసం చేసుకుంది.

Also read : Salaar : సలార్ మొత్తంలో ప్రభాస్.. కేవలం ఇన్నిసార్లే మాట్లాడాడా.. ఇంత తక్కువ డైలాగ్సా..

ఇక ఇటు ఇండియాలోనూ ప్రభాస్‌దే పైచేయి కావడం, అటు అమెరికాలో కూడా అదే అవ్వడంతో రెబల్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా సుమారు 500 కోట్ల వరకు రాబట్టినట్లు చెబుతున్నారు. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన లేదు.

కాగా ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 350 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడం.. కలెక్షన్స్ కి పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టింది. ప్రభాస్ కి పిల్లల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కానీ A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పిల్లల్ని సినిమా చూడడానికి అనుమతించడం లేదు. దీంతో పిల్లలందరూ తమ బాహుబలిని చూడలేక నిరాశతో ఇంటికి వెనుదిరుగుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రావాల్సిన కలెక్షన్స్ కి దెబ్బ పడుతుంది. అలాగే డార్లింగ్ ని అభిమానించే అమ్మాయిలు కూడా ఈ సర్టిఫికెట్ వల్ల ఫ్యామిలీస్ తో రాలేక ఈ మూవీకి కొంచెం దూరం అవుతున్నారు.