Salaar : సలార్ మొత్తంలో ప్రభాస్.. కేవలం ఇన్నిసార్లే మాట్లాడాడా.. ఇంత తక్కువ డైలాగ్సా..

సలార్ చూసి వచ్చిన చ్చిన ఆడియన్స్ అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే సలార్ మొత్తంలో ప్రభాస్ ఎన్ని డైలాగ్స్ మాట్లాడాడు అని కూడా చర్చలు చేసుకుంటున్నారు.

Salaar : సలార్ మొత్తంలో ప్రభాస్.. కేవలం ఇన్నిసార్లే మాట్లాడాడా.. ఇంత తక్కువ డైలాగ్సా..

Rebal Star Prabhas dialogues count in Salaar Part 1 Cease Fire

Updated On : December 27, 2023 / 5:50 PM IST

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలతో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. గత వారం భారీ అంచనాలు మధ్య పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు.

ఈ మూవీలోని పాత్రలకు ఎక్కడ ఎలా కనెక్షన్ ఉంది..? సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారని ఒకర్ని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు. ఈక్రమంలోనే సలార్ మొత్తంలో ప్రభాస్ ఎన్ని డైలాగ్స్ మాట్లాడాడు అని కూడా చర్చలు చేసుకుంటున్నారు. సినిమాలో ప్రభాస్ పెద్దగా మాట్లాడారు. ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు ప్రభాస్ కి మాటలే ఉండవు. సెకండ్ హాఫ్ లో కూడా పెద్ద డైలాగ్స్ ఏం చెప్పారు.

పగిలిందా, సారీ, రెండు నిమిషాల్లో దొరలా రెడీ చేస్తా, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, వాళ్లను గర్ల్ ఫ్రెండ్స్ అంటారు.. ఇలా చిన్న డైలాగ్స్ తోనే ప్రభాస్ నటించారు. సలార్ మొత్తంలో ప్రభాస్.. 38 డైలాగ్ మాత్రమే చెప్పారట. ఇప్పటివరకు వచ్చిన ప్రభాస్ సినిమాలు అన్నిటిలో.. అతి తక్కువ డైలాగ్స్ ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. అయితే ప్రభాస్ కట్ అవుట్ కి సినిమాలో ఆ 38 డైలాగ్‌లు చాలు అనిపిస్తున్నాయి అని ఆడియన్స్ చెబుతున్నారు.

Also read : Salaar : సలార్ సినిమాకు A సర్టిఫికెట్ ఎఫెక్ట్.. ప్రభాస్ బుల్లి ఫ్యాన్స్ సలార్‌కి దూరమవుతున్నారా..?

ఇక సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తండ్రిగా ఎవరు కనిపించబోతున్నారు అనే ప్రశ్నకు కొంతమంది అభిమానులు రియాక్ట్ అవుతూ.. ఆ పాత్రని కూడా ప్రభాసే పోషిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో మూవీ నుంచి మెలితిప్పిన మీసంతో, కొంచెం ఓల్డ్ లుక్ లో ఉన్న ప్రభాస్ లుక్స్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ లుక్ అలా లేదు. దీంతో ఆ లుక్ తండ్రి పాత్రదే అంటున్నారు.

కాగా ఈ మూవీకి ఇప్పటివరకు 500 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. అలాగే ఈ సినిమా 1000 కోట్ల మార్కెట్ లోకి అడుగు పెడుతుందా అనేది కూడా ఆసక్తిగా మారింది.