Prabhas: ప్రభాస్ షాకింగ్ రెమ్యునరేషన్.. బాలీవుడ్‌ను మించి!
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్..

Prabhas 25
Prabhas: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. నెక్ట్స్ సమ్మర్ కు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తీసుకురానున్నాడు. మరోవైపు సలార్ ని స్పీడప్ చేస్తూనే నాగశ్విన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇవి కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ సినిమాకు ముహూర్తం పెట్టేశాడు.
Prabhas: ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ కోసం కొత్త గెటప్!
కాగా, బాహుబలికే హయ్యస్ట్ పెయిడ్ టాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమా హిట్ తో 100కోట్ల రెమ్యూనరేషన్ ని ఎప్పుడో క్రాస్ చేసేశారు. ఎప్పుడో 5 ఏళ్ళక్రితం వచ్చిన బాహుబలికే అంత రెమ్యూనరేషన్ తీసుకుంటే వరుసగా 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ప్రస్తుతం ఎన్ని వందల కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతుందో తెలుసా..?. ప్రస్తుతం చేసే 5 సినిమాలకు కలిపి ప్రభాస్ దాదాపు 600కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ కోడై కూస్తుంది. అది కూడా ఓ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.
Prabhas: చేతినిండా సినిమాలు.. ఇంతకీ ప్రభాస్ పెళ్ళెప్పుడు?
అర్జున్‌రెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోనే ప్రభాస్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్ పొందుతున్నాడట. ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలీవుడ్ ట్రేడ్ టాక్.
Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?
బాలీవుడ్ లో వంద కోట్ల రెమ్యునరేషన్ అంటే సాధారణ విషయమే. వంద కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యూనిరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే.. ఏకంగా వారిని తలదన్నేలా.. ఓ సౌత్ హీరో ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ అంటే సాధారణ విషయం కాదు. అలాగే ఏకంగా ఎనిమిది బాషలలో సినిమా కూడా నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో షాకింగ్ విషయమే. మరి సందీప్-ప్రభాస్ ఈ మిరాకిల్ ను ఏ స్థాయికి చేరుస్తారో చూడాలి.