The Raja Saab : ప్ర‌భాస్ ‘ది రాజాసాబ్’ టీజ‌ర్ లీక్‌..! నెటిజ‌న్‌ల‌కు చిత్ర‌బృందం హెచ్చ‌రిక‌..

ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ రాజా సాబ్‌

The Raja Saab : ప్ర‌భాస్ ‘ది రాజాసాబ్’ టీజ‌ర్ లీక్‌..! నెటిజ‌న్‌ల‌కు చిత్ర‌బృందం హెచ్చ‌రిక‌..

Prabhas The raja saab team Strict action will be taken if movie content share unofficially

Updated On : June 13, 2025 / 1:25 PM IST

ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘ది రాజా సాబ్‌’. డిసెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా జూన్ 16న ఉద‌యం 10 గంట‌ల 52 నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

అయితే.. తాజాగా ఈ చిత్ర బృందానికి లీకుల బెడ‌ద మొద‌లైంది. టీజ‌ర్‌లోని కొన్ని స‌న్నివేశాలు నెట్టింట లీక్ అయ్యాయి. దీని పై చిత్ర బృందం స్పందించింది. లీక్ కంటెంట్‌ను ఎవ‌రైనా షేర్ చేస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చిత్ర‌బృందం హెచ్చ‌రించింది.

Chiranjeevi-Anil Ravipudi : మెగా 157 నుంచి సూపర్​ అప్​డేట్..

ఎవ‌రైనా స‌రే రాజాసాబ్ కంటెంట్‌కు సంబంధించిన అన‌ధికార‌క వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తే వారి సోష‌ల్ మీడియా మీడియా అకౌంట్‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయిస్తామ‌ని తెలిపింది. సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర‌బృందం ఎంతో క‌ష్ట‌ప‌డుతోంద‌ని తెలిపింది. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరింది.

Surekhavani : టాటూ వేయించుకున్న ‘సురేఖవాణి’.. ఏం టాటూ వేయించుకుందో చూశారా? వీడియో వైరల్..

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా సంజయ్ దత్‌, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.