ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్లు.. బీ టౌన్ స్టార్ హీరోయిన్స్ గరం గరం?
ఓ వాస్తవ సంఘటన ఆధారంగా వస్తున్న ఆ సినిమాలో..

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు పోటీ పడుతుంటారు. టాలీవుడ్ యాక్టర్స్‌తోపాటు బీ.టౌన్ హీరోయిన్లు సైతం ప్రభాస్ సినిమాలో ఆఫర్ల కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ, ప్రభాస్ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఇద్దరు విదేశీ వనితలకు కొట్టేశారట… తమ అవకాశాలను విదేశీ భామలు కొల్లగొట్టడంతో స్వదేశీ యాక్టర్లు తెగ ఫీల్ అవుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది… మరి ఆ ప్రచారంలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..
హను రాఘవ పూడి డైరెక్షన్‌లో మైత్రి మూవీస్ బ్యానర్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇటివల ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమా స్టార్ట్ కాకముందు నుంచి ఎన్నో గ్యాసిప్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. 1940లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా వస్తున్న ఆ సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు టాక్.
ఇక ప్రభాస్ జోడిగా ఇండో పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్‌ను సెలెక్ట్ చేశారు. పాకిస్తానీ అమ్మాయి అయినా మన దేశంలో కూడా ఆమెకు ఎంతో పాపులార్టీ సంపాదించుకుంది. ఇమాన్ ఇస్మాయిల్ పాపులరిటీని చూసే ప్రభాస్ సినిమాకు సెలెక్ట్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్రెడీ ఒక పాకిస్తానీ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ చేస్తుంటే… ఇదే సినిమాలో మరో పాకిస్తానీ బ్యూటీతో కూడా ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోతున్నాదంటూ షాకింగ్ రూమర్స్ బి.టౌన్ నుంచి మొదలయ్యాయి.
ఇమాన్ ఇస్మాయిల్‌తోపాటు పాకిస్తాన్‌లో మంచి పాపులర్ యాక్టర్ అయిన సజల్ అలయ్‌ని తీసుకున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంతో మన హీరోయిన్లు ఉసూరుమంటున్నారు. ప్రభాస్ పాకిస్తానీ అమ్మాయిలతోనే రొమాన్స్ చేస్తాడా? ఒక హీరోయిన్‌గా తమను కూడా తీసుకుంటే ఏమైతుంది అంటూ బీ టౌన్ స్టార్ హీరోయిన్స్ ప్రభాస్‌పై గరమవుతున్నారంటున్నారు. ఇక ఇద్దరు పాకిస్తానీ అమ్మాయిలతో ప్రభాస్ ఎలా నలిగిపోతాడో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
Also Read : పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?