ప్రగ్యాను పిలిచారు.. సయేషాను సైడ్ చేశారు.. ఎందుకంటే!

  • Published By: sekhar ,Published On : November 21, 2020 / 06:24 PM IST
ప్రగ్యాను పిలిచారు.. సయేషాను సైడ్ చేశారు.. ఎందుకంటే!

Updated On : November 21, 2020 / 7:01 PM IST

Pragya Jaiswal: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్
మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.. కొద్ది నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.


ముందుగా బాలయ్య పక్కన సయేషా సైగల్ కథానాయికగా నటించనుందని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆమె ప్లేస్‌లో ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారు. బాలయ్య పక్కన తను పిల్లలా కనిపిస్తుందనే కారణంతోనే వద్దనుకున్నారని తెలుస్తోంది. బోయపాటి ‘జయ జానకి నాయక’ లో ప్రగ్య ప్రత్యేకపాత్రలో కనిపించి ఆకట్టుకుంది. పూర్ణ, ప్రగ్య ఇద్దరూ బాలయ్యతో జతకడుతున్నారు.ప్రస్తుతం సిటీ శివారులోని రమాదేవి స్కూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధర్వంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను 2021 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.