Prasanth Varma-MokshNandamuri : మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమా ఓపెనింగ్ ఆ రోజే..! ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్..
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఫిక్సైంది.

Prasanth Varma MokshNandamuri movie update shotting date fix
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఫిక్సైంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే.. ఇంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన మరే అప్‌డేట్ రాలేదు. ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న వివరాలు తెలియరాలేదు.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫోటోను పోస్ట్ చేశాడు. యాక్షన్‌కు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చాడు. దర్శకుడి కామెంట్ చూస్తుంటే.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అని అర్థమవుతోంది.
కాగా.. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
Allu Arjun : ‘పుష్ప 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ఫోకస్..!
ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ready for some action? @MokshNandamuri 💥💥💥#SIMBAisCOMING pic.twitter.com/dep3A1Whv9
— Prasanth Varma (@PrasanthVarma) November 29, 2024