Jai Hanuman : జై హనుమాన్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. హాలీవుడ్ తరహాలో..

జై హనుమాన్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ తరహాలో డ్రాగన్స్ తో పోరాడబోతున్న..

Jai Hanuman : జై హనుమాన్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. హాలీవుడ్ తరహాలో..

Prasanth Varma releases Jai Hanuman new poster gone viral

Jai Hanuman : హనుమాన్ సినిమాతో అందర్నీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సీక్వెల్ ‘జై హనుమాన్’తో మరింత ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. హనుమాన్ సృష్టించిన ప్రభంజనంతో జై హనుమాన్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ప్రశాంత్ వర్మ కూడా ఆ అంచనాలకు తగ్గట్లు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు.

కాగా ఈ మూవీ నుంచి ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఒక అద్భుతమైన పోస్టర్ ని తీసుకు వచ్చి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా మరో అదిరిపోయే పోస్టర్ ని తీసుకువచ్చి.. సినిమా ఎలా ఉండబోతుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ టీం కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో ఒక నిప్పులు కక్కే డ్రాగన్ హనుమంతుడి మీదకి దూసుకు వస్తున్నట్లు కనిపిస్తుంది.

Also read : Kalki 2898 AD : నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ విషెస్.. కల్కి సినిమా గురించి కామెంట్స్..

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

డ్రాగన్స్ అనేవి ఇప్పటివరకు హాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ చూసాము. ఇప్పుడు జై హనుమాన్ లో డ్రాగన్స్ ని చూడబోతున్నాము. అది కూడా మన హనుమంతుడు డ్రాగన్స్ పై పోరాడబోతున్నారు. ఈ విషయం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని 3D ఫార్మాట్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఈ చిత్రం.. సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే, ఈ సినిమా గురించిన ఓ సందేహం ఆడియన్స్ లో ఇంకా అలా మిగిలిపోయింది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఒక స్టార్ హీరో ఈ పాత్రని పోషిస్తున్నాడని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తరువాత చిరంజీవి, రానా దగ్గుబాటి పేరులు ఫిలిం వర్గాల్లో వినిపించాయి. మరి ఫైనల్ గా ఏ స్టార్ హీరో హనుమాన్ గా కనిపిస్తారో చూడాలి.