Salaar Teaser : సలార్ టీజర్.. KGFని మించి.. ఇది కూడా రెండు పార్టులుగా…

తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Salaar Teaser : సలార్ టీజర్.. KGFని మించి.. ఇది కూడా రెండు పార్టులుగా…

Prashanth neel Prabhas Salaar Movie Teaser Released

Updated On : July 6, 2023 / 5:42 AM IST

Salaar :  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్.

ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్స్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. నేడు ఉదయం 5 గంటల 12 నిమిషాలకు సలార్ టీజర్ రిలీజ్ చేసి అభినానులకు ఫుల్ జోష్ ఇచ్చారు.

ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు. KGF లో హీరోకి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివర్లో వేశారు.