Prashanth Neel : రాజమౌళి హీరోలను లైన్‌లో పెట్టాడుగా..

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. వరుసగా రాజమౌళి హీరోలతో సినిమాలు ఫిక్స్ చేసేశారు..

Prashanth Neel : రాజమౌళి హీరోలను లైన్‌లో పెట్టాడుగా..

Prashanth Neel

Updated On : October 18, 2021 / 4:11 PM IST

Prashanth Neel: తెలుగు సినిమా సత్తా ఏంటనేది ‘బాహుబలి’ రెండు పార్టులతో ప్రపంచానికి చాటిచెప్పారు రాజమౌళి. తర్వాత ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేసి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ కొట్టింది ‘కె.జి.యఫ్’.. అప్పటివరకు ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ వెండితెరపై చూడని కోలార్ మైనింగ్స్ బ్యాక్‌డ్రాప్ కథను ఎమోషనల్‌గా ప్రజెంట్ చేసి.. యావత్ చిత్ర పరిశ్రమ చూపు తన వైపు తిప్పుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Ram Charan-Prashanth Neel : మెగా మూమెంట్.. సినిమా ఫిక్స్ చేసేశారా

ఇప్పుడు ‘కె.జి.యఫ్ 2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే నీల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా రిలీజ్ అవకముందే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ – మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా కన్ఫమ్ చేసేశారు.

Most Eligible Bachelor : అఖిల్ కోసం అల్లు అర్జున్

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత డివివి దానయ్యలతో కలిసి చిరు ఇంట్లో డిన్నర్ చేసాడు నీల్. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో రామ్ చరణ్ – దానయ్య కాంబోలో ప్రశాంత్ నీల్ సినిమా చెయ్యబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో మరో సినిమా ప్లాన్ చేసాడు ప్రశాంత్.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

‘బాహుబలి’ తో ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసాడు జక్కన్న. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను పాన్ ఇండియా స్టార్స్‌గా మార్చబోతున్నాడు. ఇలా ఈ ముగ్గురు హీరోలతో సినిమాలు ప్లాన్ చేసి వాళ్ల పాన్ ఇండియా క్రేజ్ అండ్ స్టార్‌డమ్‌ని మరింత పెంచబోతున్నాడు పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Eternals Movie : ఒకే స్క్రీన్‌పై 10 మంది సూపర్ హీరోస్..