Prashanth Neel : ప్రశాంత్ నీల్ సినిమాలో అమితాబ్ విలన్‌గా.. NTR31లో చేయబోతున్నారా..?

అమితాబ్ బచ్చన్ విలన్‌గా ప్రశాంత్ నీల్ సినిమా. NTR31లో చేయబోతున్నారా..?

Prashanth Neel : ప్రశాంత్ నీల్ సినిమాలో అమితాబ్ విలన్‌గా.. NTR31లో చేయబోతున్నారా..?

Prashanth Neel will be made Amitabh Bachchan as great villain in his movie

Updated On : December 1, 2023 / 7:56 PM IST

Prashanth Neel : కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’తో మరో సంచలనం సృష్టిచేందుకు సిద్ధమవుతున్నారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తను మరణించేలోపు అమితాబ్ బచ్చన్ తో ఒక సినిమా చేయాలనేది తన డ్రీం అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అయితే అమితాబ్ ని హీరోగా కాకుండా విలన్ గా చూపిస్తారట. తన సినిమాలో పెద్ద విలన్ గా అమితాబ్ ని చూపించాలనేది ప్రశాంత్ నీల్ కోరిక అని తెలియజేశారు. అయితే ఈ కోరికని ప్రశాంత్ నీల్ ఎప్పుడు నెరవేర్చుకోబోతున్నారు అనేది తెలియజేయలేదు. ప్రశాంత్ తన తరువాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

Also read : Nani : సందీప్ వంగా మొదటి సినిమా నానితో చేయాల్సింది.. కానీ ఏమైందంటే..!

దీంతో అమితాబ్ ని ఈ సినిమాలో విలన్ గా చూపించమని తారక్ అభిమానులు సలహా ఇస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ కూడా ఇదే ఆలోచిస్తున్నారా..? అనేది చూడాలి. ప్రస్తుతం అమితాబ్ కూడా టాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో భాగం అవుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే NTR31లో నటించే అవకాశం ఎక్కువ ఉంది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తి అయ్యేసరికి 2025 పడుతుంది. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉంది. దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా 2025లో పట్టాలు ఎక్కుతుంది. మరి విలన్ గా అమితాబ్ కనిపిస్తారేమో చూడాలి.