‘రాధే శ్యామ్’.. కూల్ అండ్ స్టెలిష్ లుక్‌లో డార్లింగ్..

Radhe Shyam Pre Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’.. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన సినిమా.. అదేదో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా కాదు.. అయినా సరే జక్కన్నకు మించి చెక్కుతున్నారు టీమ్. ఆ చెక్కుడు లాస్ట్ స్టేజ్‌కి రావడంతో ఫైనల్లీ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
మరి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఫ్యాన్స్ ముందుకెప్పుడు రాబోతున్నారు..? రిలీజ్ డేట్ సంగతి పక్కన పెడితే కనీసం టీజర్ ఎప్పుడు వదులుతారో చెప్పండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల గోల చెయ్యడంతో ఎట్టకేలకు టీజర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా 70 కాలంలో రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుపుతూ.. ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో డార్లింగ్ లవర్‌బాయ్‌గా కూల్ అండ్ స్టెలిష్ లుక్‌లో మంచు అందాలను ఆస్వాదిస్తూ చక్కని చిరునవ్వుతో అలా వాక్ చేస్తూ కనిపించాడు.