Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

ప్రేమంటే ఇదేరా.. రాజకుమారుడు లాంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైంది.

Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

Preity Zinta

Updated On : November 18, 2021 / 2:35 PM IST

Preity Zinta: ప్రేమంటే ఇదేరా.. రాజకుమారుడు లాంటి తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైంది. 2016లో ప్రీతి ఫారెన్ బిజినెస్ మ్యాన్ జీన్ గుడెనఫ్ ని వివాహం చేసుకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి వయసు 46 ఏళ్ళు. మొత్తానికి ఇప్పటికైనా తల్లైన ప్రీతి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సరోగసి విధానం ద్వారా ప్రీతి జింతా, జీన్ దంపతులు కవల పిల్లలు జన్మించారు.

RRR : ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. 50 రోజుల్లో

‘హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము. ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తమ కవలలకు జై జింతా మరియు గియా జింతా అని పేర్లు కూడా నిర్ణయించుకున్నామని ఈ జంట చేసిన ప్రకటన వారి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

ఇప్పటికే శిల్పా శెట్టి, అమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సోహైల్ ఖాన్, ఫరాహ్ ఖాన్, కరణ్ జోహార్, తుస్సార్ కపూర్, ఏక్తా కపూర్, సన్నీలియోన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ప్రీతీ జీన్ జంట కూడా పయనించింది. మొత్తం ఐవీఎఫ్, సరోగసీ పద్దతులలో మాతృత్వాన్ని పొందిన జాబితాలో ప్రీతీ కూడా చేరింది.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)