Kali : ‘క‌లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ రోజే ప్రేక్ష‌కుల ముందుకు..

టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న చిత్రం కలి.

Kali : ‘క‌లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ రోజే ప్రేక్ష‌కుల ముందుకు..

Prince Kali Release date fix

Updated On : September 16, 2024 / 4:48 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న చిత్రం కలి. శివ శేషు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ నిర్మిస్తోంది. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ మూవీ అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర‌బృందం అంటోంది.

Jani Master : జానీ మాస్ట‌ర్‌కు షాకిచ్చిన జ‌న‌సేన పార్టీ..