“Bro Daddy”: మోహన్‌లాల్‌తో లూసిఫర్ దర్శకుని మరో సినిమా!

మలయాళంలో రూ. 200కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుని సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా "లూసిఫెర్". మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత అదే కాంబినేషన్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ మళ్లీ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

“Bro Daddy”: మోహన్‌లాల్‌తో లూసిఫర్ దర్శకుని మరో సినిమా!

Bro Daddy

Updated On : June 20, 2021 / 3:44 PM IST

Bro Daddy: మలయాళంలో రూ. 200కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుని సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా “లూసిఫెర్”. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత అదే కాంబినేషన్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ మళ్లీ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిట్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.

ఈరోజు “Father’s Day” సంధర్భంగా చాలా మంది ఈ టైటిల్ ఉపయోగిస్తూ స్టేటస్‌లు పెట్టేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. తన రెండవ చిత్రం పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘బ్రో డాడీ ‘ అనే సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ ఫిల్మ్’ అవుతుందంటూ కామెంట్ చేశారు.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కూడా నటిస్తుండగా.. కల్యాణి ప్రియదర్శన్, మీనా, లాలూ అలెక్స్, మురళి గోపి, కనిహా, సౌబిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ఎన్ మరియు బిబిన్ మాలియెక్కల్ కథ అందించారు. ఈ చిత్రాన్ని ఆషిర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.

పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన మరియు మురళి గోపి స్క్రిప్ట్ రాసిన లూసిఫర్ మలయాళంలో ప్రముఖ బ్లాక్ బస్టర్లలో ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ ఎంపూరాన్ కోసం వీరిద్దరూ మళ్లీ జతకట్టనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ సినిమా కంటే ముందే కోవిడ్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభించినట్లు తెలుస్తుంది.