The Goat Life – Aadu Jeevitham Collections : మలయాళ ఇండస్ట్రీలో మరో కలెక్షన్స్ సునామీ.. ‘గోట్ లైఫ్’ కలెక్షన్స్ దూకుడు..

మలయాళ ఇండస్ట్రీలో మరో కలెక్షన్స్ సునామీ మొదలయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ‘గోట్ లైఫ్’ కలెక్షన్స్ దూకుడు..

The Goat Life – Aadu Jeevitham Collections : మలయాళ ఇండస్ట్రీలో మరో కలెక్షన్స్ సునామీ.. ‘గోట్ లైఫ్’ కలెక్షన్స్ దూకుడు..

Prithviraj Sukumaran The Goat Life Aadu Jeevitham Movie three days collections report

Updated On : March 31, 2024 / 9:08 PM IST

The Goat Life – Aadu Jeevitham Collections : సౌత్ ఇండస్ట్రీలో కంటెంట్ పరంగా మలయాళ పరిశ్రమ అదుర్స్ అనిపించుకుంటుంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ సినిమాలు చాలా తక్కువుగా ఉంటాయి. అయితే ఈమధ్య కాలంలో మలయాళ పరిశ్రమలో కూడా మార్పులు వస్తున్నాయి. వరుసపెట్టి 100 కోట్ల సినిమాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలోనే 2018, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు వందల కోట్లు కొల్లగొట్టి సత్తా చాటుతున్నాయి.

ఇక ఇప్పుడు ఆ మార్క్ ని అందుకునే దారిలో ‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’ కూడా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రం మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజయింది. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని బ్లెస్సీ డైరెక్ట్ చేసారు. థియేటర్ లో మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నేడు ఆదివారం కావడంతో ఆ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also read : Pawan Kalyan : నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా.. అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.. శివాజీ రాజా కామెంట్స్..

ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే.. మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో 100 కోట్ల సినిమా సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇలా వరుస వంద కోట్ల సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ రేంజ్ కూడా పెరుగుతూ పోతుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెలాంటి సినిమాలు మలయాళ పరిశ్రమ నుంచి వస్తాయో చూడాలి.

ఆడు జీవితం – ది గోట్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ మరియు బ్లేస్సి 16 ఏళ్ళకు పైగా కష్టపడ్డారు. ఈ మూవీని తెరకెక్కించడంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పృథ్వీరాజ్ అయితే బాడీ విషయంలో ఎంతో సన్నబడ్డారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి వెళ్లిన వ్యక్తి అక్కడి ఇబ్బందులను భరించలేక.. ఎడారి మార్గం నుంచి నడుస్తూ ఇండియా ఎలా చేరుకున్నాడు అనేది కథ.