Pawan Kalyan : నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా.. అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.. శివాజీ రాజా కామెంట్స్..

నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా అని పవన్ కళ్యాణ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకి వార్నింగ్ ఇచ్చారట.

Pawan Kalyan : నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా.. అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.. శివాజీ రాజా కామెంట్స్..

Shivaji Raja sensational comments about Pawan Kalyan

Updated On : March 31, 2024 / 8:26 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వార్నింగ్ ఇచ్చారని సీనియర్ నటుడు శివాజీ రాజా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించిన శివాజీ రాజా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇక ఈ నటుడికి మెగా ఫ్యామిలీతో మంచి స్నేహం బంధం కూడా ఉండేది. దాదాపు 30 ఏళ్ళ పాటు నాగబాబు, శివాజీ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. పవన్ కళ్యాణ్ తో కూడా శివాజీకి మంచి స్నేహం ఉండేది.

కానీ ఒక సంఘటన శివాజీ, నాగబాబు స్నేహం మధ్య గ్యాప్ తీసుకు వచ్చింది. ఆ సంఘటన పవన్ కళ్యాణ్ కి సంబంధించింది. టాలీవుడ్ లో శ్రీరెడ్డి విషయం తెలియని వారు ఎవరు ఉండరు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఈ నటి టాలీవుడ్ లో పెద్ద గొడవ చేసింది. ఆ గొడవలోనే మెగా బ్రదర్స్ తల్లిపై కూడా కామెంట్స్ చేసారు. దానికి పవన్ సీరియస్ అయ్యి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఫైర్ అయ్యారు.

Also read : Chiranjeevi – Prabhas : చిరంజీవి కోటి ఇస్తానంటే.. ప్రభాస్ రెండు కోట్లు ఇస్తా అన్నాడు.. శివాజీ రాజా కామెంట్స్

ఆ సమయంలో పవన్ మా అసోసియేషన్ ఆఫీస్ కి వెళ్లి పెద్ద గొడవనే చేసారు. కాగా ఆ టైములో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శివాజీ రాజా ఉన్నారు. అంత పెద్ద గొడవ జరుగుతున్నా శివాజీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పవన్ ఫైర్ అయ్యారట. ఈక్రమంలోనే పవన్ కోపంతో మాట్లాడుతూ.. “నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా” అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, చెప్పినట్లు నెక్స్ట్ టర్మ్ మా ఎలక్షన్స్ లో నాగబాబు.. శివాజీని ఓడించేలా పనిచేసారు. చివరాఖరికి ఓడించారు కూడా.

అయితే పవన్ విషయంలో శివాజీ ఎటువంటి తప్పు చేయలేదని, శ్రీరెడ్డి విషయంలో తాను రెస్పాండ్ అయ్యినట్లు పేర్కొన్నారు. శ్రీరెడ్డి పై డిజిపికి కంప్లైంట్ ఇచ్చామని, కానీ ఆ విషయం పవన్ కి తెలియదని, అందువల్లే ఆయన అంత సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చారు. శివాజీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.