Chiranjeevi – Prabhas : చిరంజీవి కోటి ఇస్తానంటే.. ప్రభాస్ రెండు కోట్లు ఇస్తా అన్నాడు.. శివాజీ రాజా కామెంట్స్

చిరంజీవి కోటి ఇస్తానంటే ప్రభాస్ రెండు కోట్లు ఇస్తానని చెప్పారట. ఆ మాటలకు సీనియర్ నటుడు శివాజీ రాజాకి దిమ్మ తిరిగిందట.

Chiranjeevi – Prabhas : చిరంజీవి కోటి ఇస్తానంటే.. ప్రభాస్ రెండు కోట్లు ఇస్తా అన్నాడు.. శివాజీ రాజా కామెంట్స్

Shivaji Raja comments about chiranjeevi and prabhas

Chiranjeevi – Prabhas : టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. తెలుగు సినిమా పరిశ్రమలోని ఆర్టిస్టుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 1993లో చిరంజీవి ప్రెసిడెంట్ గా స్టార్ట్ చేసిన ఈ అసోసియేషన్ ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటుంది.

చిరంజీవి తరువాత కృష్ణ, మురళి మోహన్, నాగార్జున, నాగబాబుతో పటు పలువురు నటులు ప్రెసిడెంట్ గా చేసారు. ఈక్రమంలోనే 2017లో శివాజీ రాజా కూడా ప్రెసిడెంట్ గా చేసారు. ఆ సమయంలో సినిమా ఆర్టిస్టుల కోసం ఓ ఓల్డేజ్ హోమ్ నిర్మించాలని భావించారు. ఇక ఆ హౌస్ నిర్మాణానికి కావాల్సిన ఫండ్స్ కోసం అమెరికా డల్లాస్ లో ఓ ఈవెంట్ ని నిర్వచించారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా జరిగిన ఈ ఈవెంట్ కి చాలామంది హీరోహీరోయిన్స్ హాజరయ్యి అక్కడ ప్రదర్శన ఇచ్చారు.

Also read : Rajamouli : స్టేజి పై డాన్స్ వేసి అదరగొట్టిన రాజమౌళి దంపతులు.. వీడియో చూశారా..

ఇక ఈ ఈవెంట్ చేసినందుకు మా అసోసియేషన్ కి కోటి రూపాయిల ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ నే ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఉపయోగించాలని శివాజీ ప్లాన్ చేసారు. కాగా శివాజీ పిలిచారని తన పనులను ఆపుకొని ఈవెంట్ కి వెళ్లిన చిరంజీవి.. ఎంత ఫండ్ వస్తుందని అడిగారట. దానికి శివాజీ కోటి వస్తుందని చెప్పారట. అది విన్న చిరంజీవి.. “ఆ కోటి ఏదో నేనే ఇచ్చేసేవాడిన కదా శివాజీ. ఇదంతా ఎందుకు?” అని అన్నారట.

ఆ తరువాత ఈవెంట్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన తరువాత శివాజీ రాజా ప్రభాస్ ని కలిశారట. ప్రభాస్ కూడా మాట్లాడుతూ.. “ఈ ఈవెంట్స్ అన్ని ఎందుకులే అండి. ఒక రెండు కోట్లు ఇస్తాను ఆ ఓల్డేజ్ హోమ్ ఏదో కట్టించేయండి” అని చెప్పారట. అది విన్న శివాజీ షాక్ అయ్యారట. కేవలం చిరంజీవి, ప్రభాస్ మాత్రమే కాదు గతంలో వెంకటేష్ కూడా ఇలానే డబ్బు తానే ఇస్తాను, ఆ పని చేయించేయండి అని చెప్పారట. ఇండస్ట్రీలోని హీరోలంతా ఇలాగే ఉంటారని శివాజీ రాజా, భరద్వాజ్ చెప్పుకొచ్చారు.