Rajamouli : స్టేజి పై డాన్స్ వేసి అదరగొట్టిన రాజమౌళి దంపతులు.. వీడియో చూశారా..
'అందమైన ప్రేమారాణి' పాటకి స్టేజి పై డాన్స్ వేసి అదరగొట్టిన రాజమౌళి దంపతులు.. వీడియో చూశారా..

Rajamouli and his wife dance video gone viral in social media
Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ప్రస్తుతం SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నారు. ఒక పక్క ఈ పనులను చూస్తూనే.. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవలే జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ డేస్ ని మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసారు. ఇక తాజాగా తన సతీమణి రమాతో కలిసి స్టేజి పై డాన్స్ వేసి వావ్ అనిపించారు.
రాజమౌళి, రమా కలిసి స్టేజి పై ‘అందమైన ప్రేమారాణి’ డాన్స్ వేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ఏ ఈవెంట్ కి సంబంధించింది అనేది తెలియదు గాని, వీడియోలో రాజమౌళి డాన్స్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. “రాజమౌళి ఈజ్ ఏ డైరెక్టర్ ఆల్సో, డాన్సర్ ఆల్సో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి డాన్స్ వీడియోని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram
ఇక SSMB29 విషయానికి వస్తే.. ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్లో ఈ సినిమా ఉండబోతుందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ విజువలైజేషన్ పనులను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని కూడా రెండు పార్టులుగా తీసుకు రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.