Priyamani : పుష్ప 2లో ప్రియ‌మ‌ణి..? ఆ వార్త విని ఆశ్చర్యపోయా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). సుకుమార్ (Sukumar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Priyamani : పుష్ప 2లో ప్రియ‌మ‌ణి..? ఆ వార్త విని ఆశ్చర్యపోయా..

Priyamani

Updated On : September 10, 2023 / 8:08 PM IST

Priyamani in Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). సుకుమార్ (Sukumar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే.. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi) ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని, ఆయ‌న‌కు భార్య‌గా ప్రియ‌మ‌ణి (Priyamani) క‌నిపించ‌నుంద‌నేది ఆ వార్త సారాంశం.

Jailer : చిత్ర యూనిట్‌కి బంగారు కానుకలు అందజేసిన జైలర్ నిర్మాతలు..

తాజాగా దీనిపై ప్రియ‌మ‌ణి స్పందించారు. అందులో ఎంత మాత్రం నిజం లేద‌ని చెప్పింది. తాను పుష్ప చిత్రంలో న‌టించ‌డం లేద‌ని వెల్ల‌డించింది. ఆ వార్త‌ను చూసిన వెంట‌నే తాను ఆశ్చ‌ర్యపోయాన‌ని, వెంట‌నే త‌న మేనేజ‌ర్‌కు ఫోన్ చేసిన‌ట్లు తెలిపింది. అయితే.. ఒక‌వేళ అవ‌కాశం వ‌స్తే మాత్రం అల్లు అర్జున్‌తో క‌లిసి న‌టించేందుకు ఎప్పుడు సిద్ధ‌మేన‌ని చెప్పుకుంది. ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించిన జ‌వాన్ విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణికి పుష్ప సినిమాపై ప్ర‌శ్నించ‌గా పై విధంగా స్పందించింది.

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన ఫారిన్ వెళ్ళింది అందుకేనట..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) తెర‌కెక్కించిన సినిమా జ‌వాన్ (Jawan). న‌యనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా క‌నిపించారు. ప్రియమణి, దీపికా పదుకొనే, సాన్య మల్హోత్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రూ.350 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.