Priyanka Chopra : డీప్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా.. ఆ డైరెక్టర్.. బాలీవుడ్ కెరీర్ పై ప్రియాంక చోప్రా కామెంట్స్!
ఇటీవల బాలీవుడ్ లో జరిగే రాజకీయాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి న్యూస్ లో నిలిచిన ప్రియాంక చోప్రా.. తాజాగా తన లైఫ్ లో బాగా మానసిక వేదనకు గురైన సంఘటనను షేర్ చేసుకుంది.

Priyanka Chopra comments on bollywood director Anil Sharma
Priyanka Chopra : హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రోజు ఏదో ఒక న్యూస్ తో టైం లైన్ లో నిలుస్తుంది. ఇటీవల బాలీవుడ్ లో జరిగే రాజకీయాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వైరల్ అయ్యింది. ఇప్పుడు తన లైఫ్ లో బాగా మానసిక వేదనకు గురైన సంఘటనను షేర్ చేసుకుంది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ (Miss World) టైటిల్ ని అందుకున్న ప్రియాంక.. ఆ తరువాత చాలా బ్యాడ్ కండిషన్ ని పేస్ చేయాల్సి వచ్చిందట.
Priyanka Chopra Citadel : వరల్డ్ టాప్ వెబ్ సిరీస్‌గా ప్రియాంక సిటాడెల్.. సమంత ఏమి చేస్తుందో?
మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న కొద్దిసేపటికే ప్రియాంక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి హాస్పిటల్ లో జాయిన్ అయ్యిందట. ప్రియాంకను చెక్ చేసిన డాక్టర్ శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో సర్జరీ చేయించుంకుంది ప్రియాంక. అయితే ఆ సర్జరీ వల్ల తన ముక్కు షేప్ మారిపోయిందని, తన పేస్ మొత్తం మారిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. దాని వల్ల ప్రియాంకను ఆల్రెడీ సినిమాలోకి తీసుకున్న కొందరు మేకర్స్ ఆమెను ఆ ప్రాజెక్ట్స్ ని నుంచి తొలిగించారు. అలా తన చేతిలో నుంచి మూడు సినిమాలు పోయాయని వెల్లడించింది.
Priyanka Chopra : సిటాడెల్ లో ప్రియాంక చోప్రా న్యూడ్ సీన్స్.. మరి ఇండియన్ వర్షన్ లో సమంత?
దీంతో తన కెరీర్ అక్కడితో అయ్యిపోయిందని చాలా డీప్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. ఆ సమయంలో తన తండ్రి తనకి ఎంతో ధైర్యం చెప్పారని, ఆ ధైర్యంతో మళ్ళీ సర్జరీ చేయించుకొని మునపటి లుక్ లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. అయితే తన ముక్కు కారణంగా తన ఒకే చేసిన సినిమాల నుంచి పలువురు మేకర్స్ తొలిగించిన సమయంలో తనకి దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma) అవకాశం ఇచ్చి అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. తనని నిర్మాతలు కాదంటున్నా, అనిల్ శర్మ.. “ఇది చిన్న పాత్ర మాత్రమే, ఆమెకు ఇవ్వండి” అంటూ సపోర్టింగ్ రోల్ కోసం తీసుకున్నాడట. కాగా ప్రియాంకని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా అనిల్ శర్మనే.