Priyanka Chopra : నేను మిస్ వరల్డ్ గెలిచినప్పుడు నా భర్తకు ఏడేళ్లు.. మా అత్తమ్మ చెప్పింది విని ఆశ్చర్యపోయా..
తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వారి పాత రిలేషన్స్ గురించి, తన మిస్ వరల్డ్ గురించి.. ఇలా ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.

Priyanka Chopra says interesting factors about her husband nick jonas
Priyanka Chopra : బాలీవుడ్(Bollywood) లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత హాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తుండటంతో అక్కడికి చెక్కేసింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అక్కడే హాలీవుడ్(Hollywood) లో వరస సినిమాలు చేస్తూ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas) ని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది ప్రియాంక చోప్రా. ఇటీవల వరుస హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇక వాటి ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనేక ఆసక్తికర అంశాలను మాట్లాడి ప్రియాంక చోప్రా ఇటీవల రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన గురించి, తన భర్త గురించి, వారి పాత రిలేషన్స్ గురించి, తన మిస్ వరల్డ్ గురించి.. ఇలా ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.
ఈ నేపథ్యంలో తన భర్త గురించి చెప్పిన ఓ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నిక్ ని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాకు ఓ విషయం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిక్ నా కంటే పదేళ్లు చిన్న అని తెలిసినా ఈ విషయం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నేను మిస్ వరల్డ్ గెలిచినప్పుడు నా వయసు 17 ఏళ్ళు. లండన్ వేదికగా జరిగిన ఆ పోటీల్లో నేను మిస్ వరల్డ్ గెలిచాను. అప్పటికి నాకు ఇంకా ప్రపంచం గురించి పూర్తిగా తెలీదు. నేనేం చేస్తున్నానో, నా గురించి ఎవరేమనుకుంటున్నారో ఇవేమి తెలియదు. ఆ మిస్ వరల్డ్ పోటీల గురించి మా అత్తమ్మ ఒకసారి నాతో మాట్లాడుతూ.. 2000లో జరిగిన ఆ మిస్ వరల్డ్ పోటీలు మా మామయ్య – అత్తమ్మ టీవిలో చూశారట. అప్పుడు నిక్ కు ఏడేళ్లు. చిన్నపిల్లాడైన నిక్ ని తమతో పాటు కూర్చోపెట్టుకొని నేను మిస్ వరల్డ్ గెలవడం టీవిలో చూశారని చెప్పారు. ఇది విని చాలా ఆశ్చర్యపోయాను. నేను మిస్ వరల్డ్ గెలిచేసరికి నిక్ కు ఏడేళ్లు మాత్రమే. అయినా విధి మా ఇద్దర్ని కలిపింది. వయసు పరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నా ప్రేమించుకొని, పెద్దల్ని ఒప్పించుకొనే పెళ్లి చేసుకున్నాం అని తెలిపింది.
Priyanka Chopra : నేను, నా భర్త పెళ్ళికి ముందు చాలా మందితో డేటింగ్ చేశాం.. కానీ గతం అనవసరం..
దీంతో ప్రియాంక చెప్పిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ప్రియాంక మిస్ వరల్డ్ గెలిచేటప్పటికి తన భర్త నిక్ కు ఏడేళ్లే అని చెప్పడం, అది వాళ్ళ అత్తా – మామలు టీవీలో నిక్ తో పాటు కలిసి చూడటం ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా అంది అంటున్నారు అభిమానులు, నెటిజన్లు.