Anil Sunkara : డైరెక్టర్‌గా సినిమా చేస్తానంటున్న ఏజెంట్ నిర్మాత.. అది కూడా భారీ బడ్జెట్ లో..
ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కబవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Producer Anil Sunkara wants to direct a big movie in soon
Anil Sunkara : AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర త్వరలో ఏజెంట్ సినిమాతో రాబోతున్నారు. ఏజెంట్ సినిమాలో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాతో ఫుల్ యాక్షన్ మోడ్ లో అఖిల్ రాబోతున్నాడు. అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఏజెంట్ సినిమా.
ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ సుంకర AK ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బిందాస్, రాజు గారి గది, ఆడో రకం ఈడో రకం, దూకుడు, వన్ నేనొక్కడ్నే, లెజెండ్, ఆగడు, హైపర్, లై, సరిలేరు నీకెవ్వరు, బంగారు బుల్లోడు, కిరాక్ పార్టీ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. నిర్మాతగానే గాక గతంలో అల్లరి నరేష్ హీరోగా యాక్షన్ 3D అనే ఓ సినిమాని అనిల్ సుంకర డైరెక్షన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ వైపు రాలేదు.
Changure Bangaru Raja : మాస్ మహారాజ నిర్మాతగా కొత్త సినిమా.. టీజర్ చూశారా?
తాజాగా అనిల్ సుంకర ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో మళ్ళీ దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయి. అది కూడా ఏజెంట్ లాగే స్పై జోనర్ లో తీస్తాను. మా 14 రీల్స్ సంస్థలోనే భారీ బడ్జెట్ తో త్వరలో ఈ సినిమాను ప్రకటిస్తాం అని తెలిపారు. దీంతో మరి ఆ భారీ బడ్జెట్ సినిమా ఏ హీరోతో చేస్తారా? అనిల్ సుంకర డైరెక్టర్ గా సక్సెస్ అవుతారా అని ఆలోచిస్తున్నారు సినీ ప్రేక్షకులు.