Yogi Babu : స్టార్ కమెడియన్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు..

తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరగగా యోగిబాబు తప్ప చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఈవెంట్లో నిర్మాత, దర్శకుడు గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ యోగిబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.............

Yogi Babu : స్టార్ కమెడియన్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు..

producer kishor complaint on yogibabu in tamil producers council

Updated On : December 6, 2022 / 7:21 AM IST

Yogi Babu : తమిళ్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు యోగిబాబు. ఇప్పుడు యోగిబాబు మెయిన్ లీడ్ లో కామెడీ ప్రధానంగా సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు, నిర్మాత గిన్నిస్ కిషోర్.. యోగిబాబు మెయిన్ లీడ్ లో దాదా అనే ఓ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.

తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరగగా యోగిబాబు తప్ప చిత్ర యూనిట్ అంతా విచ్చేశారు. ఈవెంట్లో నిర్మాత, దర్శకుడు గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ యోగిబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

Riteish Deshmukh : మహిళా అభిమాని కాళ్ళు పట్టుకున్న హీరో..

గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ.. ”యోగిబాబు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు కూడా బయ్యర్లకి ఫోన్ చేసి ఈ సినిమాలో నేను నాలుగు సన్నివేశాల్లోనే నటించాను కొనకండి అని చెప్తున్నాడంట. సినిమా చూస్తే తెలుస్తుంది ఎన్ని సన్నివేశాల్లో నటించాడో. డబ్బింగ్ చెప్పడానికి కూడా అనేక ఇబ్బందులకు గురిచేశాడు. ఆల్రెడీ అతనితో ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ సినిమా చేయనంటున్నాడు. అందుకే యోగిబాబుపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను. నా సినిమాలో నటించకపోతే వేరే సినిమాల్లో కూడా నటించకుండా చర్యలు తీసుకోవాలని కోరాను” అని తెలిపారు.