Guntur Kaaram : అభిమానుల అంచనాలు చూసి.. భయంతో వెనక్కి వెళ్తున్నాము.. నిర్మాత నాగవంశీ

అభిమానుల అంచనాలు చూసి భయంతో వెనక్కి వెళ్తున్నాము. ప్రతిసారి ఏదోకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము అంటూ గుంటూరు కారం నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Guntur Kaaram : అభిమానుల అంచనాలు చూసి.. భయంతో వెనక్కి వెళ్తున్నాము.. నిర్మాత నాగవంశీ

Producer Naga Vamsi comments on Mahesh Babu Guntur Kaaram

Updated On : November 1, 2023 / 3:36 PM IST

Guntur Kaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కుతుంది. ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా.. షూటింగ్ లేట్ అవుతూ వస్తుండడంతో రిలీజ్ పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా 2024 జనవరి 12న రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేసిన ఈ మూవీ నుంచి.. పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

అయితే ఈ మూవీ నుంచి ఒక పాటని రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిర్మాతలు కూడా పాట రెడీ అయ్యిపోయింది, రిలీజ్ చేస్తామంటూ ప్రకటించడం, మళ్ళీ పోస్టుపోన్ చేయడం అలవాటు అయ్యిపోయింది. ఈ దసరాకి మొదటి సాంగ్ ని కచ్చితంగా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. ఆ విషయం గురించే మాట్లాడలేదు. తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్మాత నాగవంశీని ఈ విషయం గురించి ప్రశ్నించగా ఆయన బదులిచ్చాడు.

Also read : Aishwarya Rai : ప్రపంచ సుందరికి 50 ఏళ్ళు.. నీలి కళ్ల సుందరి గురించి ఇవి మీకు తెలుసా..?

“పాట పై అభిమానుల అంచనాలు చూసి భయంతో వెనక్కి వెళ్తున్నాము. ప్రతిసారి ఆ సాంగ్ ని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఈసారి మాత్రం పక్కా రిలీజ్ చేస్తున్నాము. నవంబర్ మొదటి వారంలో సాంగ్ రిలీజ్ అయ్యిపోతుంది” అంటూ నాగవంశీ తెలియజేశాడు. మరి ఈసారైనా సాంగ్ రిలీజ్ రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. మొదటి పాట మెలోడీ లవ్ సాంగ్ అని చెబుతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.