Aishwarya Rai : ప్రపంచ సుందరికి 50 ఏళ్ళు.. నీలి కళ్ల సుందరి గురించి ఇవి మీకు తెలుసా..?

నవంబర్‌ 1న పుట్టిన ఈ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. అసలు ఎక్కడి అమ్మాయి..? మోడలింగ్ లోకి ఎలా వచ్చింది..? మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎప్పుడు గెలుచుకుంది..? సినిమాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది..?

Aishwarya Rai : ప్రపంచ సుందరికి 50 ఏళ్ళు.. నీలి కళ్ల సుందరి గురించి ఇవి మీకు తెలుసా..?

Aishwarya Rai Bachchan 50th birthday special story

Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో ప్రపంచానే మెస్మరైజ్ చేసి మిస్‌ వరల్డ్‌ కిరీటం సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో నటిగా ఎంతోమంది మనసులో అందాల మహారాణిలా స్థానం సంపాదించుకున్న ఐశ్వర్య రాయ్.. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది అంటే మీరు నమ్ముతారా..? మోడల్‌గా, యాక్ట్రెస్‌గా రంగుల ప్రపంచంలో తన భాద్యతలను ఎలా నిర్వర్తించిందో.. బచ్చన్‌ కుటుంబంలోకి అడుగుపెట్టి అభిషేక్ కి భార్యగా, అమితాబ్ కి కోడలిగా, ఆరాధ్యకి అమ్మగా కూడా అంతే నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తుంది.

నవంబర్‌ 1న పుట్టిన ఈ ప్రపంచ సుందరి.. అసలు ఎక్కడి అమ్మాయి..? మోడలింగ్ లోకి ఎలా వచ్చింది..? మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎప్పుడు గెలుచుకుంది..? సినిమాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది..? ఇవన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

కర్ణాటకలోని మంగుళూరు ఐశ్వర్య రాయి జన్మించింది. వీరి కుటుంబం ‘తులు’ లాంగ్వేజ్ మాట్లాడుతారు. ఐశ్వర్యకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. చిన్నప్పుడే నుంచే ఐశ్వర్య క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్ లో ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చింది. మెడిసిన్ చదువుదాం అనుకున్న ఐశ్వర్య ఆర్కిటెక్ట్ వైపు మనసు తిప్పుకొని కాలేజీలో జాయిన్ అయ్యింది. ఇక అక్కడ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది.

ఈక్రమంలోనే కొన్ని టీవీ యాడ్స్ లో నటిస్తూ వచ్చింది. అలాగే మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ ప్లేస్ లో గెలిచింది. ఆ తరువాత 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరించి విశ్వసుందరిగా నిలిచింది. ఇక ఆ తరువాత నుంచి సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈక్రమంలోనే 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇద్దరు’ (ఇరువర్) సినిమాతో తెరగేంట్రం చేసింది. ఆ వెంటనే హిందీ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

Also read : Pawan Kalyan : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్‌ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

అయితే మొదటి చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. 1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ సినిమాలో నటించి మొదటి హిట్టుని అందుకుంది. ఈ సినిమాలో ప్రపంచ ఏడు వింతలను చూపిస్తూ ప్రపంచ సుందరి పై శంకర్ పాటలు చిత్రీకరిస్తే.. ప్రేక్షకులకు ప్రపంచ వింతలు చూడాలా..? ఐశ్వర్య రాయిని చూడాలా..? అనే తికమకలో పడ్డారు.

అక్కడ మొదలైన సినిమా ప్రయాణం ఇక్కడి వరకు చేరుకుంది. ఇక పెళ్లి జీవితానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిన ఐశ్వర్య కొన్నాళ్ల తరువాత అతడితో విబేధాలు వచ్చి విడిపోయింది. ఆ తరువాత ధూమ్2 మూవీ షూటింగ్ టైములో అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐశ్వర్య.. 2007 జనవరి 14న నిశ్చితార్ధం చేసుకొని 2007 ఏప్రిల్ 20న వివాహం చేసుకున్నారు. 2011లో నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది.