Naga Vamsi : మా సైడ్ నుంచి అదే తప్పు అనుకుంటున్నాం.. ‘గుంటూరు కారం’పై నిర్మాత కామెంట్స్..
తాజాగా గుంటూరు కారం సినిమా గురించి, కలెక్షన్స్ గురించి, రిజల్ట్ గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Producer Naga Vamsi Press Meet on Mahesh Babu Guntur Kaaram Movie Result
Naga Vamsi : మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ఇటీవల సంక్రాంతికి రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా వారం రోజుల్లో 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ విజయం పై చిత్రయూనిట్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్ రోజు కొంచెం నెగిటివ్ టాక్, మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో పలువురు సినిమా బాగోలేదని కామెంట్స్ కూడా చేశారు. కొంతమంది సినిమాపై విమర్శలు చేశారు. ఇటీవల దిల్ రాజు, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా బాగా ఆడుతుందని, మంచి కలెక్షన్స్ వచ్చాయి అన్నారు. తాజాగా గుంటూరు కారం సినిమా గురించి, కలెక్షన్స్ గురించి, రిజల్ట్ గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నాగవంశీ మాట్లాడుతూ.. సినిమాకి బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. అందరికి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందరికి డబ్బులు వస్తున్నాయి. బయ్యర్స్ సేఫ్ అయ్యారు. అందుకే ఈ ప్రెస్ మీట్. కలెక్షన్స్ ఫేక్ అనే వాళ్ళు ప్రూవ్ చేయవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ మేము పట్టించుకోము. ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫ్యామిలీస్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాయి. చాలా మంది మహిళలు సినిమా చూసి మాట్లాడిన వీడియోలు చూశాను. డబ్బులు వస్తే సినిమా హిట్ అయినట్టే అన్నారు.
Also Read : Prabhas : ప్రభాస్ ఆ డైరెక్టర్స్ వద్దే కంఫర్టబుల్‌గా ఉంటాడట.. పాపం రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..
అలాగే.. కాకపోతే మేము చేసిన తప్పు అర్ధరాత్రి 1 Am షోలు వేయడం, సినిమాని ఫ్యామిలీ ఎమోషన్ లా ప్రమోట్ చేయలేకపోవడం. మా సైడ్ నుంచి అదే తప్పు అనుకుంటున్నాం. ఫ్యాన్స్ ఫుల్ మాస్ సినిమా అనుకున్నారు. 1 AM కి వచ్చేవాళ్లంతా అలాగే అనుకోని వచ్చారు, మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండి వాళ్ళ అంచనాలు అందుకోలేకపోయాం కాబట్టి కొంత నెగిటివిటి వచ్చింది. కానీ మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాక సినిమాకి బాగా కనెక్ట్ అయి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి అన్ని థియేటర్స్ ఫుల్ అయి మంచి రిజల్ట్ వచ్చింది. రివ్యూలు, సోషల్ మీడియాలో మార్నింగ్ వచ్చిన టాక్ చూసి వాటి వాళ్ళ కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ సాయంత్రం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చాక సినిమా హిట్ టాక్ వచ్చింది అని అన్నారు.