Naga Vamsi : బుక్ మై షోలో రేటింగ్స్, లైక్స్ అన్ని డబ్బులిచ్చే కొంటాం.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఇకనైనా ఫ్యాన్స్ మారాలి..
తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Naga Vamsi
Naga Vamsi : ఫ్యాన్స్ తమ హీరోల గురించి గొప్పలకు పోతారని తెలిసిందే. కారణం లేకుండానే మా హీరో గొప్ప, మా హీరో సినిమాకు ఇంత రేటింగ్, ఇన్ని వ్యూస్, ఇన్ని లైక్స్, ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అని ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. ఇప్పటికే కలెక్షన్స్ ఫ్యాన్స్ కోసం వేస్తాము, అవన్నీ ఫేక్ అని నిర్మాత నాగవంశీ గతంలోనే చెప్పాడు. యూట్యూబ్ వ్యూస్ డబ్బులు ఇచ్చి కొంటాము అని దిల్ రాజు డైరెక్ట్ గానే చెప్పారు. అయినా ఫ్యాన్ వార్స్ ఆపట్లేదు.
తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బుక్ మై షోలో రేటింగ్స్, లైక్స్.. ఇవన్నీ కూడా మేము డబ్బులిచ్చి చేయిస్తున్నాము. ఒక ఇద్దరు హీరోల సినిమాలు, లేదా రెండు సినిమాలు ఒకేసారి లేదా తక్కువ గ్యాప్ తో రిలీజయితే బుక్ మై షోలో వాళ్లకు ఎక్కువ లైక్స్ ఉన్నాయి, మనకు తక్కువ ఉన్నాయి డబ్బులిచ్చి చేయించాలి అని పీర్వోలు చెప్తున్నారు. లేకపోతే బయట ఫ్యాన్స్ తిడతారు అంటున్నారు. దాంతో మేము చేయించండి అని చెప్తున్నాము. ఇవన్నీ నిర్మాతలకు జరుగుతున్న నష్టాలు. ఇవన్నీ చూసి గిల్డ్ లో బుక్ మై షోలో ప్రమోషన్స్ వద్దు అని నిర్ణయం తీసుకున్నాం. మనం సినిమాని అక్కడ పెట్టి టికెట్స్ అమ్మితే ఆ సైట్ నడుస్తుంది. కానీ వాడు ప్రమోషన్ పేరుతో మళ్ళీ మన దగ్గరే డబ్బులు తీసుకుంటున్నాడు. టికెట్ మీద కమిషన్ ఆల్రెడీ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఈ ప్రమోషన్స్ కి డబ్బులు. లాస్ట్ రెండు మూడు నెలల నుంచి కొంతమంది నిర్మాతలు బుక్ మై షోకి ఈ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. ఫ్యాన్స్ తిడతారని మేము కొన్ని వ్యూస్, ఈ బుక్ మై షో లైక్స్, రేటింగ్స్ అన్ని కొంటున్నాము మా భయంతో. హీరోలు ఎవరూ ఇవి చేయమని చెప్పరు. అవన్నీ డబ్బులు ఇచ్చి కొనేవి అని అందరికి తెలియాలి అని అన్నారు.
Also Read : Mahesh Babu : శ్రీలంకకు వెళ్తున్న మహేష్ బాబు.. షూటింగ్ కోసమా? వెకేషన్ కోసమా? ఫ్లైట్ లో ఫోటో వైరల్..
అలాగే.. సినిమా రిలీజ్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ వచ్చే ట్విట్టర్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చే రివ్యూలు అన్ని మేము మేనేజ్ చేస్తున్నాము. మాకు నచ్చే వాళ్ళు, మేము నచ్చేవాళ్ళు పాజిటివ్ గా ఇస్తారు. నచ్చని వాళ్ళు నెగిటివ్ గా ఇస్తారు. ఇది ఒక మయా ప్రపంచం. వాటిని చూసి ఆడియన్స్ ఎఫెక్ట్ అవ్వొద్దు అని అన్నారు. నిర్మాతలు ఇంత క్లియర్ గా చెప్తున్నా ఫ్యాన్స్ ఇంకా మా హీరో సినిమా అని కొట్టుకోవడం ఆపకపోతే వాళ్ళకే నష్టం అని అభిప్రాయపడుతున్నారు.