Nagavamsi : రాజమౌళి కలెక్షన్స్ దాకా వెళతాం.. మహేష్-త్రివిక్రమ్ సినిమాపై నిర్మాత వ్యాఖ్యలు..
హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో..................

producer Nagavamsi comments on Mahesh Trivikram Movie
Nagavamsi : హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో మూడో షెడ్యూల్ షూటింగ్ కి వెళ్లనుంది. మహేష్-త్రివిక్రమ్ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఈ సినిమా భారీ హిట్ అవుద్దని, మ్యూజిక్ అదిరిపోతుందని సినిమాపై అంచనాలు పెంచేసాడు. తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ సినిమా గురించి మాట్లాడుతూ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేశారు. నాగవంశీ తన సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ధనుష్ సార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడాడు.
Dhanush Sir : నెక్లెస్ రోడ్ లో గ్రాండ్ గా.. నేడే ధనుష్ ‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది. సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ అవుతుంది. మహేష్-త్రివిక్రమ్ సినిమా రాజమౌళి కలెక్షన్స్ దగ్గరకు కచ్చితంగా వెళ్తుంది. అభిమానుల అంచనాలను అందుకుంటుంది ఈ సినిమా. చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేస్తాం అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు స్పందిస్తూ రాజమౌళి కలెక్షన్స్ వరకు అంటే సినిమా భారీ హిట్ అవుతుందని భావిస్తుంటే కొంతమంది మాత్రం మరీ అంత అంచనాలు పెట్టుకోకూడదు అంటున్నారు. మరి గతంలో అతడు, ఖలేజా సినిమాలతో మ్యాజిక్ చేసిన మహేష్-త్రివిక్రమ్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతారో చూడాలి.