Natti Kumar : ఇండస్ట్రీని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.. ప్రొడ్యూసర్ గిల్డ్ ని తీసెయ్యండి.. నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..
నిర్మాత నట్టి కుమార్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి దాసరి నారాయణరావు గురించి మాట్లాడారు. ఆయనపై బయోపిక్ తీస్తాను అని చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీని రెండు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ, ప్రొడ్యూసర్ గిల్డ్ తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..................

Producer Natti Kumar sensational comments on Producer Gild and AP, Telangana governments regarding Movie Industry
Natti Kumar : నిర్మాత నట్టి కుమార్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి దాసరి నారాయణరావు గురించి మాట్లాడారు. ఆయనపై బయోపిక్ తీస్తాను అని చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీని రెండు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ, ప్రొడ్యూసర్ గిల్డ్ తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ..Ysr ఆరోగ్య శ్రీ తరపున సినీ కార్మికుల కోసం దాసరి నారాయణ 1100 మందికి మెడికల్ క్లైయిమ్ ఇచ్చారు. మే 4న దాసరి బర్త్ డే సందర్బంగా ఆయన జర్నీ మైయిన్ కధాంశంగా బయోపిక్ తిస్తున్నాను. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తాను. దాసరి నారాయణరావు గురించి అందరికి తెలియాలి. కొంత మంది సభ్యులు వేరే కూటమిని పెట్టి కార్మికులను నడిరోడ్డు మీద పడేశారు. నిర్మాతల సంఘం ఎలక్షన్స్ లో ఒక్కటే కమిటీ ఉండాలి అని సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ లు అన్నారు. ఒక్కటే కమిటీ ఉండాలి గిల్డ్ ను తీసేయ్యండి. గిల్డ్ సభ్యులు కౌన్సిల్ లో ఉంటే మేము అందరం సపోర్ట్ చేస్తాము. గిల్డ్ వాళ్ళు నెలరోజులు షూటింగ్ బంద్ చేసినా సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళవి డ్రామాలు.
నేను చెప్పేది నిజమా, కాదా అనేది డిబేట్ పెట్టండి కావాలంటే. గిల్డ్ లో అంతా పెద్ద నిర్మాతలే, వాళ్లకి నచ్చినట్టు అన్ని మారుస్తారు. చిన్న నిర్మాతలు గిల్డ్ వాళ్లకు ఓట్లు వెయ్యొద్దు. కౌన్సిల్ లో ఎవరు గెలిచిన అందరికి మెడికల్ క్లయిం ఇవ్వాలి. రెండు రాష్ట్రాలు సినిమా ఇండస్ట్రీని సరిగ్గా గుర్తించట్లేదు. నలుగురు అయిదుగురు వెళ్లి వాళ్ళ సమస్యలు తలసాని గారికి చెప్తారు, అవే పరిష్కారం అవుతాయి.
పోసాని గారు, అలీ గారు సినిమా ఇండస్ట్రీ గురించి అక్కడ ప్రభుత్వంతో ఏమి మాట్లాడారో తెలీదు. రెండు రాష్ట్రాల ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లు, సినిమాటోగ్రఫీ మంత్రులు, రోజా గారు మా సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదు. మా చిన్న నిర్మాతలు బాధలను పట్టించుకోండి. కౌన్సెల్ ఎలక్షన్స్ లో గిల్డ్ సభ్యులు గెలిస్తే మెడికల్ క్లయిం ఇవ్వరు. ప్రతి కార్మికుడికి మెడికల్ క్లెయిమ్ 7 లక్షలు ఇవ్వాలి, కార్మికుడికి భరోసా ఇవ్వండి.
Movies Clash : రిలీజ్‌ల విషయంలో స్టార్ హీరోల క్లాష్‌లు.. ఈ ఏడాది కూడా తప్పట్లేదు..
ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుని రెండు రాష్ట్రాలు మరచిపోయారు. ఆయన పేరు మీద ఏమి చెయ్యలేదు. కాపులు కూడా ఆయన్ని మరచిపోయారు. దాసరి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా ఏపి ముఖ్యమంత్రి జగన్ గారు, తెలంగాణ సిఎం కేసీఆర్ గారు చెయ్యాలి అని నా రిక్వెస్ట్. సినిమా ఇండస్ట్రీని, దాసరి గారిని మీరు పట్టించుకోకపోతే ఫిబ్రవరి 19 తరువాత నిరసన వ్యక్తం చేస్తాము అంటూ ఫైర్ అయ్యారు. దీంతో నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారాయి.