Producer SKN : జీవిత, రాజశేఖర్ జైలు శిక్షపై బేబీ మెగా ఈవెంట్లో కామెంట్స్.. మెగాస్టార్ ముందే మాట్లాడిన నిర్మాత SKN
గతంలో ఓ పదేళ్ల క్రితం జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అల్లు అరవింద్ కేసు వేయగా ఆ కేసు ఇన్నాళ్లు సాగుతూ వచ్చి ఇటీవలే వారిద్దరికీ జైలు శిక్ష విధించారు. అయితే జీవిత రాజశేఖర్ బెయిలు తెచ్చుకొని పై కోర్టుకి వెళ్లారు. తాజాగా దీనిపై బేబీ ఈవెంట్ లో నిర్మాత SKN మాట్లాడారు.

Producer SKN Comments on Jeevitha Rajasekhar in Baby Movie Success Event
Producer SKN : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరి అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న అల్లు అర్జున్ ఈవెంట్ చేయగా, తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ ని అభినందించారు.
ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. బేబీ సినిమా దర్శకుడు, నిర్మాత, టీంలో చాలా మంది మెగాస్టార్ ఫ్యాన్స్ అవ్వడంతో మాట్లాడిన వాళ్లంతా చిరంజీవి గురించి, చిరంజీవి సినిమాలతో తమకు ఉన్న అనుభవం గురించి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత SKN మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిగా తను చేసిన పనులను పంచుకున్నాడు. అలాగే చిరంజీవిపై కామెంట్స్ చేసే వాళ్ళ గురించి, ఇటీవల జీవిత రాజశేఖర్ లకు పడిన జైలు శిక్ష గురించి కూడా మాట్లాడారు.
గతంలో ఓ పదేళ్ల క్రితం జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అల్లు అరవింద్ కేసు వేయగా ఆ కేసు ఇన్నాళ్లు సాగుతూ వచ్చి ఇటీవలే వారిద్దరికీ జైలు శిక్ష విధించారు. అయితే జీవిత రాజశేఖర్ బెయిలు తెచ్చుకొని పై కోర్టుకి వెళ్లారు. తాజాగా దీనిపై బేబీ ఈవెంట్ లో నిర్మాత SKN మాట్లాడారు.
నిర్మాత SKN మాట్లాడుతూ.. మంచితనం ఒక శిఖరం అయితే మెగాస్టార్ ఎవరెస్ట్ లాంటి వారు. ఆయనను కామెంట్ చేసిన వారిని కూడా దగ్గరకు తీసే స్వభావం చిరంజీవి గారిది. ఆయన్ని తిట్టిన వాళ్ళే ఓ మూడు నెలల తర్వాత ఆయన దగ్గరికి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయనతో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు. కానీ చిరంజీవి గారు అవేమి పట్టించుకోకుండా నవ్వుతూ వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. ఆయన చేసే సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ గురించి కూడా కామెంట్ చేసేవారు ఉంటారు. అలాగే ఒకరు ఎప్పుడో కామెంట్స్ చేస్తే వాళ్లకు ఈ మధ్యే జైలు శిక్ష పడింది. మిమ్మల్ని ఎవరన్నా నెగిటివ్ గా అంటే మా ఫ్యాన్స్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. సోషల్ మీడియా వచ్చాక మా ఫ్యాన్స్ అంతా ఎడ్యుకేట్ అయి విమర్శల్ని ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకున్నాం. నిజం చెబుతున్నా ఆంజనేయుడికి ఆయన బలం తెలియనట్లే చిరంజీవి గారికి ఆయన శక్తి, ఆయన అభిమానుల శక్తి తెలియదు అని అన్నారు. దీంతో మెగాస్టార్ ముందే జీవిత రాజశేఖర్ జైలు శిక్ష గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.