Producer SKN : అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కాకముందే నేను విజయ్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చాను..

బేబీ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా SKN ఇంటర్వ్యూ ఇవ్వగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Producer SKN : అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కాకముందే నేను విజయ్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చాను..

Producer SKN comments on Vijay Devrakonda and Anand Devarakonda

Updated On : July 7, 2023 / 11:25 AM IST

Producer SKN : నిర్మాత SKN (శ్రీనివాస కుమార్ నాయుడు) ఇటీవల తన సినిమాల కంటే తన స్పీచ్ లతోనే బాగా పాపులర్ అయ్యాడు. సినిమా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ తర్వాత ఆ రేంజ్ లో స్పీచ్ లు ఇచ్చి ఇటీవల బాగా పాపులర్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు SKN. ప్రస్తుతం SKN నిర్మాతగా బేబీ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

బేబీ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. జులై 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా SKN ఇంటర్వ్యూ ఇవ్వగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

SKN ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కాకముందే నేను విజయ్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చాను. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా తీసి హిట్ ఇచ్చాను. అలాగే ఆనంద్ దేవరకొండకు బేబీ సినిమాతో మంచి హిట్ ఇస్తాను. నిర్మాతగానే సినిమాలు చేస్తాను, డైరెక్షన్ జోలికి మాత్రం వెళ్ళాను. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు, ఇంకోటి ఓటీటీకోసం తీయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం సందీప్ రాజ్, సాయి రాజేష్, రాహుల్ సంక్రుత్యాన్, VI ఆనంద్ లతో సినిమాలు తీయబోతున్నాం అని తెలిపాడు.

Manchu Lakshmi : మనోజ్ – మౌనికల పెళ్లి అవ్వాలని ఆ గుడికి వెళ్లి దండం పెట్టుకున్నా.. పెళ్ళికి ముందు నా ఇంట్లోనే ఉన్నారు..

SKN నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా గతంలో టాక్సీవాలా సినిమా వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కి ముందే అది షూటింగ్ లో ఉన్నప్పుడే టాక్సీవాలా సినిమాకు SKN విజయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కొన్ని కారణాలతో కొంచెం లేట్ గా రిలీజ్ అయింది. టాక్సీవాలా సినిమా మంచి డీసెంట్ హిట్ కొట్టింది. దీంతో విజయ్ కి హిట్ ఇచ్చాను అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆనంద్ కి కూడా బేబీ సినిమాతో హిట్ ఇస్తాను అని చెప్పాడు SKN. దీంతో విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.