Project Hail Mary: బాక్సాఫీస్ వద్ద ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సునామీ.. 10 రోజుల్లోనే రూ.2500 కోట్ల వసూళ్లు
ఇండియాలో భారీ వసూళ్లు రాబడుతున్న హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ(Project Hail Mary)'.
'Project Hair Mary' getting Huge Collections in India
- ఇండియాలో హాలీవుడ్ మూవీ సెన్సేషన్
- ఇంటర్స్టెల్లార్’, ‘డ్యూన్ 2’ రికార్డులు బద్దలు
- ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ క్రేజ్ నెక్స్ట్ లెవల్
Project Hail Mary: హాలీవుడ్ లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ(Project Hail Mary)’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అద్భుతమైన మౌత్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం, విడుదలైన కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $300 మిలియన్ల (సుమారు రూ. 2500 కోట్లు) మార్కును దాటి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
SKN: ’నోటి ** తగ్గించుకో..‘ ‘పెద్ది’పై SKN కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన నిర్మాత
మార్చి 26న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి ఇండియాలో ఏకంగా రూ.17.28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఐమాక్స్ (IMAX), 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. తెల్లవారుజామున 3:45 గంటలకే షోలు పడుతున్నా క్షణాల్లో హౌస్ఫుల్ అవుతుండటం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. గతంలో వచ్చిన భారీ చిత్రాలైన ‘ఇంటర్స్టెల్లార్’ కంటే 53 శాతం, ‘డ్యూన్ 2’ కంటే 35 శాతం ఎక్కువ వసూళ్లను రాబడుతూ ఇండియాలో కొత్త రికార్డులను తిరగరాస్తోంది.
2025లో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తర్వాత మన ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించిన అంతర్జాతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్ర పోషించారు. గతం మర్చిపోయిన ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఒంటరిగా మేల్కొని, మానవాళిని రక్షించేందుకు చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీకెండ్లో అదిరిపోయే వసూళ్లతో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సైన్స్ ఫిక్షన్ ప్రియులకు ఈ సినిమా ఒక మర్చిపోలేని అనుభూతిని మిగిలిస్తోంది.
