Prabhas : హాలీవుడ్ స్టేజిపై ఇండియన్ కల్చర్‌తో ప్రాజెక్ట్ K లాంచింగ్.. ప్రభాస్‌ని పరిచయం చేసిన రానా..

కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు.

Prabhas : హాలీవుడ్ స్టేజిపై ఇండియన్ కల్చర్‌తో ప్రాజెక్ట్ K లాంచింగ్.. ప్రభాస్‌ని పరిచయం చేసిన రానా..

Project K Team Welcomed by Indian Culture Programs on Hollywood Stage in Comic Con Event Prabhas introduced by Rana

Updated On : July 21, 2023 / 11:34 AM IST

Comic Con Event : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, రానా పాల్గొన్నారు.

సినిమాకు కల్కి అనే టైటిల్ ని ప్రకటించారు. సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రానా.

Prabhas : ఈ సినిమాలో నేనొక కమెడియన్‌ని.. ప్రాజెక్ట్ K సినిమాపై హాలీవుడ్ మీడియాతో ప్రభాస్ వ్యాఖ్యలు..

ఇక ప్రాజెక్ట్ K టీం స్టేజి మీదకు వచ్చేముందు మన ఇండియన్ కల్చర్ లో ఆహ్వానం పలికారు. మేళతాళాలతో కొంతమంది స్టేజి మీద ప్రదర్శన ఇస్తుంటే, కొంతమంది మహిళలు దీపాలతో స్టేజిపైకి వచ్చి ఆహ్వానం పలికారు. హాలీవుడ్ స్టేజిపై ఇలా మన ఇండియన్ కల్చర్ తో ప్రాజెక్ట్ K టీంకు ఆహ్వానం పలకడంతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ఆసక్తిగా చూశారు. ప్రభాస్ స్టేజిపైకి వచ్చినప్పుడు అక్కడ ప్రేక్షకులంతా అరుపులతో హడావిడి చేశారు. ప్రభాస్ కోసం స్పెషల్ AV కూడా ప్రదర్శించడం విశేషం. దీంతో ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.