Puneeth Rajkumar : పునీత్‌కు నివాళి .. విజయోత్సవ సభలు జరిగిన చోటే సంస్మరణ సభ

తాజాగా కర్ణాటక సినీ పరిశ్రమ, కర్ణాటక ప్రభుత్వం తరపున పునీత్ రాజ్ కుమార్ కు గొప్ప సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాటు చేసిన స్థలం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కన్నడ సినీ పరిశ్రమ

Puneeth Rajkumar : పునీత్‌కు నివాళి .. విజయోత్సవ సభలు జరిగిన చోటే సంస్మరణ సభ

Puneeth Raj (1)

Updated On : November 17, 2021 / 12:11 PM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపు 20 రోజులు అవుతున్నా ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకలో రోజూ ఏదో ఒక చోట పునీత్ సంస్మరణ సభలు జరుగుతూనే ఉన్నాయి, పునీత్ కి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక సినీ పరిశ్రమ, కర్ణాటక ప్రభుత్వం తరపున పునీత్ రాజ్ కుమార్ కు గొప్ప సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.

Chiranjeevi : ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి : చిరంజీవి

అయితే ఈ సభ ఏర్పాటు చేసిన స్థలం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కన్నడ సినీ పరిశ్రమ తలపెట్టిన పునీత్ శ్రద్ధాంజలి సభని బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. గతంలో పునీత్ నటించిన ఎన్నో సినిమా వేడుకలు అదే గ్రౌండ్ లో జరిగాయి. పునీత్ సినిమాల సక్సెస్ ఫంక్షన్స్ ఇక్కడే జరిగాయి. ఇప్పుడు అదే వేదికపై ఆయన శ్రద్ధాంజలి సభ జరుగుతుండటంతో ఎంతో బాధని వ్యక్తపరిచారు. ఈ సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. పునీత్ తో తమకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకొని స్టేజ్ మీదే ఏడ్చేశారు. పునీత్ విజయోత్సవ సభలకి హాజరయిన ఈ గ్రౌండ్స్ లో ఇలా శ్రద్ధాంజలి సభ ఉంటుందని ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Sharukh Khan : ఆ విషయంలో డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్న షారుఖ్

ఇదే వేదికపై ‘రాజకుమార’ సినిమా 100 రోజుల వేడుక జరిగిందని, పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నారు తమిళ నటుడు శరత్ కుమార్. తన శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా కానీ ఆయన శ్రద్ధాంజలి నేను రావాల్సి వచ్చింది. దేవుడు పునీత్ రాజ్ కుమార్ బదులు నన్ను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపై ఏడ్చేశాడు శరత్ కుమార్. ఆ సభకి విచ్చేసిన వాళ్లంతా కూడా పునీత్ ని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.