Chiranjeevi : ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి : చిరంజీవి

మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినిమా కళాకారులకి నంది అవార్డులు ఇచ్చేవారు. రాష్ట్రం విడిపోయాక ఒక రెండు సంవత్సరాలు అవార్డుని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అవార్డుల గురించే మర్చిపోయారు.

Chiranjeevi : ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం మర్చిపోయాయి : చిరంజీవి

Chiru

Chiranjeevi :  ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమాలకి అవార్డులు ఇస్తారు. ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ వేడుకని నిర్వహిస్తారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినిమా కళాకారులకి నంది అవార్డులు ఇచ్చేవారు. రాష్ట్రం విడిపోయాక ఒక రెండు సంవత్సరాలు అవార్డుని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అవార్డుల గురించే మర్చిపోయారు. అటు ఏపీ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారికంగా ఎటువంటి అవార్డుల ఫంక్షన్ ని నిర్వహించలేదు ఇప్పటి వరకు.

Sharukh Khan : ఆ విషయంలో డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్న షారుఖ్

దీనిపై చిరంజీవి, నాగార్జున మరి కొంతమంది సినీ పెద్దలు రెండు ప్రభుత్వాలని కలిసి అవార్డుల ఫంక్షన్ చేయమని, కళాకారులని ప్రోత్సహించామని కోరారు. వాటికి సానుకూలంగానే స్పందించినా ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదు. చివరి సారిగా 2016లో నంది అవార్డ్స్ ను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటి ఊసు ఎవరు ఎత్తలేదు. ఇక కరోనా తర్వాత సినిమా పరిశ్రమని, థియేటర్స్ ని కాపాడుకోవడానికి సినీ పెద్దలు ప్రభుత్వాల్ని కలుస్తున్నారు. ఇలాంటి టైంలో అవార్డ్స్ ఫంక్షన్ అంటే కష్టమే అని తెలిసిపోతుంది. తాజాగా ఈ అవార్డ్స్ పై చిరంజీవి మరోసారి వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss 5 : నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు.. వెళ్ళిపో.. సిరిపై సీరియస్ అయిన ష‌ణ్ను

ఇటీవల సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా చిరంజీవి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు సినిమా కళాకారులకి అందించే అవార్డుల సంగతిని మరిచిపోయాయి. ఇకపై రెండు రాష్ట్రాలు ఆలోచించి సినీ అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహించాలని అన్నారు. కళాకారులకి అవార్డులు గొప్ప ఉత్సాహాన్నిస్తాయి. ప్రభుత్వాలు సినిమా కళాకారులకి అవార్డులు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అవార్డుల ఫంక్షన్ ని నిర్వహిస్తాయేమో చూడాలి.